Watch: నేషనల్‌ పార్క్‌లో దారుణం.. పర్యాటకుల సఫారీ జీప్‌పై ఖడ్గమృగాల దాడి.. బోల్తాపడ్డ వాహనం

చాలా కాలంగా ఇదే వృత్తిలో ఉన్న కమల్ గాజీ అనే డ్రైవర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదన్నారు.

Watch: నేషనల్‌ పార్క్‌లో దారుణం.. పర్యాటకుల సఫారీ జీప్‌పై ఖడ్గమృగాల దాడి.. బోల్తాపడ్డ వాహనం
Wildlife Safari
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 27, 2023 | 5:45 PM

దేశ వ్యాప్తంగా ఉన్న వన్యప్రాణుల సఫారీలలో అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో భద్రత, రక్షణ కోసం టైమింగ్స్‌, కొన్ని మార్గదర్శకాలు అమలు చేస్తుంటారు. అయితే, సఫారీలు ఇప్పుడు అడ్వెంచర్ స్పోర్ట్స్‌గా మారుతున్నారు! జల్దపరా నేషనల్ పార్క్‌లో అందమైన సఫారీ చేస్తున్న పర్యాటకులకు ఊహించని షాక్‌ తగిలింది. ఏడుగురు పర్యాటకులు ప్రయాణిస్తున్న వాహనాన్ని రెండు ఖడ్గమృగాలు వెంటాడాయి. దాంతో ప్రాణాలు కాపాడుకోవటానికి వారు చేసిన ప్రయత్నంతో మరో పెనుప్రమాదం ఎదురైంది. సఫారీ సాహస యాత్రకు ఉత్సాహం చూపిన ఏడుగురు పర్యాటకులు సఫారీ జీపు ఎక్కి అడవిలోకి వెళ్లారు. వారు రోడ్డుపై వెళ్తుండగా రోడ్డు పక్కనే ఉన్న పొదల్లో కదలికలు కనిపించాయి. రెండు ఖడ్గమృగాలు భీకరంగా పోరాడుతున్నాయి. పర్యాటకులు ఆ క్షణాన్ని వీడియో తీయడానికి ప్రయత్నించారు.. తమ కెమెరాలను రెడీ చేసుకుని షూట్‌ చేయటం మొదలుపెట్టారు. అంతలోనే అక్కడ సీన్‌ రివర్స్‌గా మారిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మీరు షాక్‌ అవుతారు..

సఫారీ జీపులో వెళ్తున్న పర్యాటకులు ఫోటోలు, వీడియో షూట్ చేయడంలో బిజీగా ఉన్నారు. అంతలోనే అక్కడ భీకరంగా పోరాడుతున్న ఖడ్గమృగాల దృష్టి వారి జీపు వైపు మళ్లింది. పర్యాటకులు తేరుకోక ముందే.. ఆ రెండు ఖడ్గమృగాలు సఫారీ జీప్ వైపు దూసుకుపోయాయి. అది గమనించిన డ్రైవర్ చాకచక్యంగా జీపు ఇంజన్ స్టార్ట్ చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. జీపును రివర్స్‌లో నడుపుతూ వేగం పెంచాడు.. కానీ, దురదృష్టవశాత్తు జీపు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న సొరంగంలో పడిపోయింది. మొత్తం ఏడుగురు పర్యాటకులు గాయపడ్డారని IANS నివేదించింది. కొందరికి ఎముకలు విరిగిపోగా, మరికొందరికి గాయాలు కాగా, కుట్లు పడ్డాయి. డ్రైవర్‌కి స్వల్ప గాయాలయ్యాయి. అయితే సంఘటన షాక్ అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన పర్యాటకులను స్థానిక మదరిహట్ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో అలీపూర్‌దువార్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. జలదాపరా జాతీయ ఉద్యానవనంలో మునుపెన్నడూ లేని విధంగా పర్యాటక వాహనాలపై ఖడ్గమృగాలు దాడికి యత్నించడంతో అధికారులు సైతం ఉలిక్కిపడ్డారు.

ఈ సంఘటన ప్రతి ఒక్కరికీ మేల్కొలుపు సంఘటనే అంటున్నారు అధికారులు. ఇప్పుడు వన్యప్రాణుల నుండి వీలైనంత దూరంలో ప్రయాణించాలని దూరాన్ని కొనసాగించాలని పర్యాటకులను చ్చరిస్తూ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.. చాలా కాలంగా ఇదే వృత్తిలో ఉన్న కమల్ గాజీ అనే డ్రైవర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదన్నారు. ఎవరూ చనిపోకపోవడం అదృష్టమని, లేదంటే పరిస్థితులు మరింత దారుణంగా ఉండేవని ఆయన అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..