హనుమంతుడి సేవలో అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హనుమంతుడి సేవలో పాల్గొన్నారు. ఆదివారం నాడు ఆయన 52వ జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన భార్య సునితా కేజ్రీవాల్‌తో కలిసి స్థానిక హనుమాన్..
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హనుమంతుడి సేవలో పాల్గొన్నారు. ఆదివారం నాడు ఆయన 52వ జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన భార్య సునితా కేజ్రీవాల్‌తో కలిసి స్థానిక హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి.. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.
కాగా, అంతకుముందు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బర్త్‌డే సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో, సంపూర్ణ జీవితం గడపాలంటూ మోదీ దేవుడిని ప్రార్ధిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆప్ నేతలతో పాటు.. ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు కూడా కేజ్రీవాల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Delhi: Chief Minister Arvind Kejriwal offers prayers at Hanuman Temple in Connaught Place along with his wife Sunita Kejriwal, on his birthday today. pic.twitter.com/uDVKYw6GkX
— ANI (@ANI) August 16, 2020
Read More :