దిలీప్ కుమార్ సోదరులకు కరోనా వైరస్ పాజిటివ్

ప్రముఖ బాలీవుడ్ లెజెండరీ దిలీప్ కుమార్ సోదరులు ఎహ్ సాన్ ఖాన్, అస్లం ఖాన్ లకు కరోనా వైరస్ పాజిటివ్ అని వెల్లడైంది. ప్రస్తుతం వీరు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో..

దిలీప్ కుమార్ సోదరులకు కరోనా వైరస్ పాజిటివ్
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 16, 2020 | 8:51 PM

ప్రముఖ బాలీవుడ్ లెజెండరీ దిలీప్ కుమార్ సోదరులు ఎహ్ సాన్ ఖాన్, అస్లం ఖాన్ లకు కరోనా వైరస్ పాజిటివ్ అని వెల్లడైంది. ప్రస్తుతం వీరు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎహ్ సాన్ ఖాన్ వయస్సు 90 ఏళ్ళు కాగా, అస్లం వయస్సు 88 సంవత్సరాలు. వీరు వెంటిలేటర్ సపోర్ట్ పై లేరని, అన్ని చికిత్సలూ అందిస్తున్నామని ఈ హాస్పటల్ వర్గాలు తెలిపాయి. ఈ అన్నదమ్ములిద్దరూ దిలీప్ కుమార్ తో కాకుండా వేరుగా ఉంటున్నారు.  ఆ మధ్య దిలీప్ కుమార్ తన ఆరోగ్యానికి సంబంధించి తెలియజేస్తూ తానూ, తన భార్య సైరా బాను పూర్తి ఐసోలేషన్ లో ఉన్నామని పేర్కొన్న విషయం విదితమే.