కరోనా వైరస్ ను జయించిన 98 ఏళ్ళ వృధ్ధుడు
కరోనా వైరస్ నుంచి 98 ఏళ్ళ వృధ్ధుడు రాము లక్ష్మణ్ సక్పాల్ పూర్తిగా కోలుకున్నారు. మాజీ సైనికుడైన ఈయన గతంలో ఆర్మీలో వివిధ హోదాల్లో పని చేశారు. కొన్ని వారాల క్రితం..
కరోనా వైరస్ నుంచి 98 ఏళ్ళ వృధ్ధుడు రాము లక్ష్మణ్ సక్పాల్ పూర్తిగా కోలుకున్నారు. మాజీ సైనికుడైన ఈయన గతంలో ఆర్మీలో వివిధ హోదాల్లో పని చేశారు. కొన్ని వారాల క్రితం ఈయనను విషమ స్థితిలో ఢిల్లీ లోని నేవల్ ఆసుపత్రి..’అశ్విని’ లో అడ్మిట్ చేశామని, అయితే చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్నారని అధికారులు తెలిపారు. హాస్పటల్ నుంచి రాము లక్ష్మణ్ కి నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, కోస్ట్ గార్డు అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.
అటు-తనకు చికిత్స చేసి న డాక్టర్లకు, వైద్య సిబ్బందికి సక్పాల్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.
Sepoy Ramu Laxman Sakpal (Retd), a 98yr old War Veteran, residing at Nerul was admitted to INHS Asvini in a critical state & diagnosed with Pneumonia due to #COVID19.Now he successfully defeated #COVID19 on 15Aug. @indiatvnews @indiannavy pic.twitter.com/2ywTAQY2Wi
— Manish Prasad (@manishindiatv) August 16, 2020