మహిళతో శృంగారంలో ఉండగా వీడియో తీసిన యువతి.. ఆ తర్వాత ఏం చేసిందంటే..?

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Nov 05, 2022 | 4:28 PM

ఓ వ్యక్తి.. మహిళతో కలిసి ఏకాంతంగా ఉండగా.. కొందరు దుర్మార్గులు కన్నేశారు. అనంతరం వారి న్యూడ్‌ వీడియో చిత్రీకరించి బ్లాక్‌మెయిల్‌ చేస్తూ దోపిడీకి పాల్పడుతున్న యువతి సహా ముగ్గురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

మహిళతో శృంగారంలో ఉండగా వీడియో తీసిన యువతి.. ఆ తర్వాత ఏం చేసిందంటే..?
Blackmailing

ఓ వ్యక్తి.. మహిళతో కలిసి ఏకాంతంగా ఉండగా.. కొందరు దుర్మార్గులు కన్నేశారు. అనంతరం వారి న్యూడ్‌ వీడియో చిత్రీకరించి బ్లాక్‌మెయిల్‌ చేస్తూ దోపిడీకి పాల్పడుతున్న యువతి సహా ముగ్గురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. రెండేళ్ల నుంచి న్యూడ్ వీడియో చూపిస్తూ.. నిందితులు బాధితులైన ఓ వ్యక్తి, మహిళ నుంచి రూ.పదిలక్షలు కాజేశారు. అనంతరం మళ్లీ డబ్బులు ఇవ్వాలంటూ బెదిరిస్తున్నారు. ఈ సమయంలో నిందితురాలైన యువతి.. మరో ఇద్దరు స్నేహితుల సమాయంతో బలవంతంగా కోటి రూపాయాల చెక్కును సైతం తీసుకున్నట్లు బాధితుడు వెల్లడించాడు. ఢిల్లీలోని వెస్ట్ కరావాల్ నగర్‌లో 22 ఏళ్ల యువతి. బాధితుడి నుంచి రూ.కోటి చెక్ తీసుకుంటూ పట్టుబడిందని ఢిల్లీ ఖజూరి ఖాస్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు మహిళతో కలిసి నగ్నంగా ఉండగా.. వీడియోను చిత్రీకరించారని పోలీసులు తెలిపారు. వీడియో తీస్తున్న సమయంలో బాధిత వ్యక్తి, మహిళ గమనించి ఎదురు తిరగడంతో నిందితులు తాము పోలీసులమని చెప్పారని, ఆ తర్వాత దాడికి కూడా పాల్పడ్డారని బాధితుడు జ్యోతినగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2020 నుంచి రూ. పది లక్షలు తీసుకున్నారని.. ఆ తర్వాత రూ. కోటి చెక్కును బలవంతంగా తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై శుక్రవారం కేసు నమోదుచేసినట్లు నార్త్ ఈస్ట్ ఢిల్లీ డీసీపీ తెలిపారు.

యువతి మరో ఇద్దరి సహాయంతో బ్లాక్ మెయిల్ చేస్తూ దోపిడీకి పాల్పడినందని.. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశామని జ్యోతి నగర్ పోలీసులు తెలిపారు. కోటి రూపాయల చెక్కును తీసుకున్న విషయంలో నిందితులపై ఖజూరి ఖాస్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu