Jammu kashmir: 38 ఏళ్లు గడిచినా చెక్కుచెదరని మృతదేహం.. ఎందుకంటే..
ఎవరైనా వ్యక్తి మరణించిన తర్వాత ఒక రోజు గడిస్తే మృతదేహం వద్ద దుర్వాసన వస్తుంది. అందుకే చాలా మంది డెడ్ బాడీని ఫ్రీజర్ లో పెడతారు. కాని.. దేశ రక్షణ కోసం విధుల్లో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు జవాన్ల మృతదేహాలు
Jammu Kashmir: ఎవరైనా వ్యక్తి మరణించిన తర్వాత ఒక రోజు గడిస్తే మృతదేహం వద్ద దుర్వాసన వస్తుంది. అందుకే చాలా మంది డెడ్ బాడీని ఫ్రీజర్ లో పెడతారు. కాని.. దేశ రక్షణ కోసం విధుల్లో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు జవాన్ల మృతదేహాలు 38 ఏళ్ల తర్వాత లభ్యమయ్యాయి. అయినా ఆ మృతదేహాలు చెక్కుచెదరకుండా ఆనవాళ్లు గుర్తించడానికి వీలుగా ఉండటం ఒకింత ఆశ్చర్యమే.. అయినా మంచుకొండల్లో ఉండటం వలన ఆ మృతదేహాలు కుళ్లిపోకుండా ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. అసలేం జరింగిందంటే.. దేశ రక్షణ కోసం ఎత్తైన మంచుకొండల్లో భారత జవాన్లు విధులు నిర్వర్తిస్తారు. కొన్ని సమయాల్లో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల నుంచి వాళ్లు తప్పించుకోవడం అసాధ్యమే. అలాంటి అత్యంత ప్రతికూల వాతావరణం ఉండే ప్రాంతాల్లో సియాచిన్ ఒకటి. సియాచిన్ లో గతంలో సంభవించిన మంచు తుపానులో పలువురు జవాన్ల ఆచూకీ దొరకలేదు. ఆఘటన జరిగిన 38 ఏళ్ల తర్వాత.. ఇటీవల ఇద్దరు జవాన్ల మృతదేహాలు లభించాయి. వీరిలో ఒకరిని ఉత్తరాఖండ్ కు చెందిన చంద్రశేఖర్ హర్బోలా అని ఆర్మీ అధికారులు ధృవీకరించారు. మరో వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు.
పాకిస్తాన్ తో యుద్ధం సందర్భంగా 1984లో భారత ఆర్మీ ఆపరేషన్ మేఘ్ దూత్ ను చేపట్టింది. దీనిలో భాగంగా ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన యుద్ధ కేంద్రంగా పేరొందిన సియాచిన్ కు 19 కుమావన్ రెజిమెంట్ కు చెందిన 20 మంది సైనికుల బృందం చేరుకుంది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆకస్మాత్తుగా చోటుచేసుకున్న మంచు తుపానుకు అక్కడున్న వారంతా కొట్టుకుపోయారు. వీరిలో 15 మంది మృతదేహాలు లభ్యం కాగా.. ఐదుగురి ఆచూకీ తెలియలేదు. తాజాగా సియాచిన్ లోని మంచుకొండల్లోని ఓ పాత బంకర్ లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఉత్తరాఖండ్ లోని అల్మోరాలో ద్వారాహత్ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ హర్బోలా.. 1975లో సైన్యంలో చేరారు. భార్య శాంతిదేవీకి.. చంద్రశేఖర్ హర్బోలా మృతదేహం లభించిన విషయాన్ని తెలియజేయగా.. తనకు 28 ఏళ్ల వయస్సులో ఆఘటన జరిగిందని.. అప్పటికే తమకు వివాహమై 9 ఏ్లు అయిందని గుర్తుచేసుకుంటూ బోరున విలపించారు. 38 ఏళ్లు భర్త రాక కోసం ఎదురుచూస్తూనే ఉన్నానని.. అయితే ఆఖరి చూపు చూస్తాననే నమ్మకం ఉందని చంద్రశేఖర్ హర్బోలా భార్య శాంతి దేవీకి తెలిపారు. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు, సవాళ్లను ఎదుర్కొంటూ.. ఓ సైనికుడి భార్యగా ధైర్యంతో పిల్లలను పెంచానని శాంతిదేవి చెప్పింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..