Delhi: ఢిల్లీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. పెరుగుతున్న కాలుష్యం కారణంగా కీలక నిర్ణయం..!

Delhi: ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలు, బస్సుల్లో ప్రయాణికులు నిలబడి ప్రయాణించవచ్చని తెలిపింది. బస్సుల్లో..

Delhi: ఢిల్లీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. పెరుగుతున్న కాలుష్యం కారణంగా కీలక నిర్ణయం..!
Subhash Goud

|

Nov 20, 2021 | 9:58 PM

Delhi: ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలు, బస్సుల్లో ప్రయాణికులు నిలబడి ప్రయాణించవచ్చని తెలిపింది. బస్సుల్లో సీటు సామర్థ్యంలో 50 శాతం వరకు ప్రయాణికులు నిలబడి ప్రయాణం చేయవచ్చని ఢిల్లి డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (డీడీఎంఏ) ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలు ప్రజారవాణాను ఎక్కువగా ఉపయోగించుకునేలా మెట్రో, బస్సులలో నిలబడి ప్రయాణించాలని ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల డీడీఎంఏకు ప్రతిపాదనలు పంపింది. నిజానికి ఢిల్లీలో కాలుష్యం నిరంతరం పెరిగిపోతోంది. AQ1 ప్రతి రోజు ప్రమాదకర స్థాయిలో ఉంటుంది. దీంతో వాహనాల కొరత ఏర్పడింది. దీంతో గరిష్టంగా ప్రజా రవాణాను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు కరోనా మార్గదర్శకాల కారణంగా ప్రయాణికులు బస్సులు, మెట్రోలలో నిలబడి ప్రయాణించడానికి అనుమతించలేదు. అయితే మెట్రో, బస్సులు 100 శాతం సీటింగ్‌ కెపాసిటీతో నడుస్తున్నాయి.

కరోనా మార్గదర్శకాలను పాటించాలి: ఇదే కాకుండా బస్సుల్లో అంతరాష్ట్ర ప్రయాణాలలో ప్రయాణికులు నిలబడి ప్రయాణించేందుకు ప్రయాణికులకు సీటింగ్‌ సామర్థ్యంలో 50 శాతం వరకు అనుతించడుతుంది. అలాగే ఎక్కడానికి వెనుక డోర్‌ వాడాలని, దిగేందుకు ముందు ద్వారా ఉపయోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

డిసెంబర్‌ 1 అర్ధరాత్రి నుంచి అమలు.. ఈ మార్గదర్శకాలు నవంబర్‌ 30, డిసెంబర్‌ 1 అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలో రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో వాహనాల సంఖ్య తగ్గిపోయింది. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఏర్పడకుండా నిలబడి ప్రయాణించేందుకు అనుమతులు వచ్చాయి.

Delhi 1

ఇవి కూడా చదవండి:

Ola Electric: ఎలక్ట్రిక్‌ వాహనాల టెస్ట్‌ రైడ్లలో దూసుకుపోతున్న ఓలా.. వాహనదారులకు గుడ్‌న్యూస్‌..!

PM SVANidhi: వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. ఈ స్కీమ్‌ కింద దరఖాస్తు చేసుకుంటే సులభంగా రుణాలు..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu