AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acid Attack: యువకుడిపై యాసిడ్‌ దాడి చేసిన ఇద్దరు పిల్లల తల్లి..! ఎందుకో తెలుసా..?

Acid Attack: కేరళలోని ఇడుక్కి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి చేసుకోను అన్నందుకు ఓ ఇద్దరు పిల్లల తల్లి ఓ యువకుడిపై యాసిడ్‌ దాడికి పాల్పడింది. దీంతో అతడు

Acid Attack: యువకుడిపై యాసిడ్‌ దాడి చేసిన ఇద్దరు పిల్లల తల్లి..! ఎందుకో తెలుసా..?
Arrest
uppula Raju
|

Updated on: Nov 21, 2021 | 6:06 AM

Share

Acid Attack: కేరళలోని ఇడుక్కి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి చేసుకోను అన్నందుకు ఓ ఇద్దరు పిల్లల తల్లి ఓ యువకుడిపై యాసిడ్‌ దాడికి పాల్పడింది. దీంతో అతడు ఇప్పుడు చూపు కోల్పోయే ప్రమాదంలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరుణ్ కుమార్ అనే వ్యక్తికి ఫేస్‌బుక్‌ ద్వారా ఒక మహిళ పరిచయం అయింది. అయితే ఆ మహిళకు పెళ్లయిందని, ఇద్దరు పిల్లలకు తల్లి అని తర్వాత తెలిసింది. దీంతో ఆమెతో ఉన్న సంబంధాన్ని అతడు క్లోజ్‌ చేయాలనుకున్నాడు.

అయితే సదరు మహిళ ఆ యువకుడిని బ్లాక్‌ మెయిల్ చేసింది. అతడి దగ్గరి నుంచి డబ్బులు డిమాండ్‌ చేసింది. దీంతో ఆ యువకుడు ఒక స్నేహితుడితో కలిసి నవంబరు 16న ఆదిమాలిలోని ఓ చర్చి సమీపంలో మహిళకు డబ్బులు ఇచ్చేందుకు వెళ్లాడు. చర్చి ఆవరణలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలో అరుణ్ కుమార్ వెనుక ఆ మహిళ నిలబడి ఉంది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఆమె ఒక్కసారిగా ముందుకు వచ్చి అతని ముఖంపై యాసిడ్ పోసింది. ఈ క్రమంలో ఆమెకు కూడా స్వల్ప గాయాలయ్యాయి.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సదరు మహిళను అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఆ యువకుడు రాష్ట్ర రాజధానిలోని మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. అతడు కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో ఇదే నెలలో పెళ్లయిన యువతిపై ఓ వ్యక్తి యాసిడ్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడికి ఉరిశిక్ష వేయాలని బాధిత మహిళ భర్త డిమాండ్ చేస్తున్నాడు. బవానా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.

Indian Railway: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. చింతించకండి ఇకనుంచి ఆ సేవలు యధావిధిగా ప్రారంభం..

Viral Video: రైలు పట్టాలపై కుందేలు.. వెనుకనే దూసుకొచ్చిన మృత్యువు.. చివరకు ఎం జరిగిందంటే..?

ఈ నెలలో విడాకులు ఎక్కువగా తీసుకుంటున్నారట..! కారణాలు ఏంటో తెలుసా..?

భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు