Indian Railway: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. చింతించకండి ఇకనుంచి ఆ సేవలు యధావిధిగా ప్రారంభం..

Indian Railway: ప్రయాణికులకు రైల్వే శుభవార్త తెలిపింది. ప్రయాణ సమయంలో రైలులో ప్యాంట్రీ కార్లను ప్రారంభించాలని ఐఆర్‌సీటీసీని ఆదేశించింది. దీంతో ప్రయాణంలో

Indian Railway: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. చింతించకండి ఇకనుంచి ఆ సేవలు యధావిధిగా ప్రారంభం..
Train
Follow us
uppula Raju

|

Updated on: Nov 20, 2021 | 6:08 AM

Indian Railway: ప్రయాణికులకు రైల్వే శుభవార్త తెలిపింది. ప్రయాణ సమయంలో రైలులో ప్యాంట్రీ కార్లను ప్రారంభించాలని ఐఆర్‌సీటీసీని ఆదేశించింది. దీంతో ప్రయాణంలో ప్రజలు ఇకనుంచి తాజా ఆహారాన్ని తినవచ్చు. కరోనా మహమ్మారి కారణంగా రైలులో ఈ-కేటరింగ్, రెడీ-టు-ఈట్ సేవలు నడుస్తున్న సంగతి తెలిసిందే. వీటికి తోడు ఇప్పుడు ప్యాంట్రీ కార్ కూడా స్టార్ట్ కానుంది. సమాచారం ప్రకారం.. మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో మొదటగా ప్యాంట్రీ కార్‌ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఐఆర్‌సీటీసీ సీఎండీకి రైల్వే బోర్డు లేఖ రాసింది.

దేశంలో సాధారణ రైలు సేవలు ప్రారంభమయ్యాయి. రెస్టారెంట్లు, హోటళ్లు వంటి సంస్థలు కూడా తెరుచుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైలులో వంట సౌకర్యాన్ని కూడా ప్రారంభించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీంతో పాటు రెడీ టు ఈట్ కూడా అందుబాటులో ఉంటుంది. కరోనా మహమ్మారి కారణంగా రైళ్లలో ప్యాంట్రీ కార్లను మూసివేశారు. 18 నెలలుగా అవి అలాగే ఉన్నాయి. దేశంలో ఇప్పుడు కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి ఆ తర్వాత మళ్లీ ప్యాంట్రీ కారును ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారతీయ రైల్వే టికెట్‌ ఛార్జీలను కూడా తగ్గించింది.

ప్రస్తుతం కరోనా పీరియడ్‌లో గత ఏడాదిన్నర కాలంగా నడుస్తున్న ప్రత్యేక రైళ్లు మునుపటిలాగా నిర్ణీత సమయ పట్టికతో క్రమం తప్పకుండా నడుస్తాయి. దీంతో ప్రయాణీకులకు ఛార్జీల్లో ఉపశమనం లభించనుంది. కరోనా కారణంగా గత ఏడాది మార్చిలో రైల్వే సేవలను నిలిపివేశారు. 1 మే 2020 నుంచి శ్రామిక్ ప్రత్యేక రైళ్లు ప్రారంభించారు. తత్కాల్‌ ఛార్జీలు తీసుకుని శ్రామిక్‌ రైళ్లలో ప్రయాణించేలా చేసింది రైల్వే. ముందుగా కన్ఫర్మ్ చేసిన టిక్కెట్లను మాత్రమే జారీ చేసి ఆ తర్వాత వెయిటింగ్ లిస్ట్ జారీ చేశారు.

IND vs NZ: రెండో మ్యాచ్‌లోనూ ఉతికారేసిన ఇండియా.. న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం..

Viral Photos: ఈ తల్లి, కూతురు ఒక మాదిరిగా కనిపిస్తారు.. ఫొటోలు చూస్తే షాక్‌ అవుతారు..

Kamala Harris: కమలా హారిస్‌కి అమెరికా అధ్యక్ష బాధ్యతలు.. కారణాలు ఇలా ఉన్నాయి..?