Fact Check: కేంద్రప్రభుత్వ ఉద్యోగులు డీఏ పెరిగిందా.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ద్రప్రభుత్వ ఉద్యోగులకు ఈఏడాది మరోసారి కరువు భత్యం (DA) ను పెంచబోతున్నారంటూ.. సెప్టెంబర్ వేతనంతో కలిపి పెంచిన డీఏను చెల్లిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో తమ డీఏ పెరగబోతుందని కేంద్రప్రభుత్వ ఉద్యోగులంతా..

Fact Check: కేంద్రప్రభుత్వ ఉద్యోగులు డీఏ పెరిగిందా.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Da
Follow us
Amarnadh Daneti

|

Updated on: Aug 25, 2022 | 8:53 PM

Fact Check: కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు ఈఏడాది మరోసారి కరువు భత్యం (DA) ను పెంచబోతున్నారంటూ.. సెప్టెంబర్ వేతనంతో కలిపి పెంచిన డీఏను చెల్లిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో తమ డీఏ పెరగబోతుందని కేంద్రప్రభుత్వ ఉద్యోగులంతా సంతోషపడుతున్నారు. అయితే ఈప్రచారం అవాస్తవమని.. దీనిని నమ్మవద్దంటూ కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఈఏడాది మార్చిలో కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రకటించింది. పెంచిన డీఏను ఈఏడాది జనవరి నుంచి అమలు చేస్తోంది. ఇక రెండో డీఏపై కూడా కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇప్పటికే 34% ఉన్న డీఏను 38%కి పెంచుతూ త్వరలో నిర్ణయం వెలువడనుందనే ప్రచారం కొద్దిరోజులుగా జోరుగా సాగుతోంది. ఈనేపథ్యంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పత్రికా సమాచార కార్యాలయం-PIB ఈవిషయంపై క్లారిటీ ఇచ్చింది.

కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 4% డీఏ పెరిగిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని సూచించింది. ఇప్పటివరకు ఈవిషయంపై కేంద్రప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టతనిచ్చింది. కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్ ను 34 శాతం నుంచి 38 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ జారీచేసినట్లుగా ఓ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2022 జులై1 నుంచి డీఏ పెంపు ఉత్తర్వులను అమలుచేస్తున్నట్లు ఈలేఖలో పేర్కొన్నారు. ఈపోస్టు వైరల్ అవడంతో పీఐబీ స్పందించింది. ఆర్థిక శాఖ పేరుతో ప్రచారం అవుతున్న ఈలేఖ నకిలీదని స్పష్టం చేసింది. కేంద్రప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఇటువంటి ప్రచారాన్ని విశ్వసించవద్దని తెలిపింది. కేంద్రప్రభుత్వం అధికారికంగా రెండో డీఏ పెంపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..