Nitin Gadkari: పొలిటికల్ మైలేజ్ కోసమే నా మాటలు వక్రీకరించారు.. అసలు వీడియో రిలీజ్ చేసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
రాజకీయ ప్రయోజనాల కోసమే తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మండిపడ్డారు. 'తనను మంత్రి పదవి నుంచి తప్పించినా తనపై ఎలాంటి ప్రభావం ఉండబోదని..
Nitin Gadkari: రాజకీయ ప్రయోజనాల కోసమే తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మండిపడ్డారు. ‘తనను మంత్రి పదవి నుంచి తప్పించినా తనపై ఎలాంటి ప్రభావం ఉండబోదని’ గడ్కరీ అన్నట్లు ఓ వీడియో మీడియాలో వైరల్ అయింది. ఈనేపథ్యంలో ఈవీడియోపై నితిన్ గడ్కరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయ అవసరాల కోసం వాడుకుంటే అలాంటివారిపై న్యాయపరమైన చర్యలకు వెనుకాడబోనని హెచ్చరించారు. పార్టీ, ప్రభుత్వ ప్రయోజనాల కోసం ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. తాను మాట్లాడిన మాటలను ఎడిట్ చేశారంటూ తాను మాట్లాడిన పూర్తి వీడియోను నితిన్ గడ్కరీ ట్వి్ట్టర్ లో పంచుకున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసమే కొందరు తనపై నీచ ప్రచారాలకు తెరలేపారని.. కొన్ని ప్రధాన మీడియా సంస్థలతో పాటు సామాజిక మాద్యమ వేదికల్లోనూ తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. ఇలాంటి మోసపూరిత ప్రచారాలను పెద్దగా పట్టించుకోనని.. ఇలాంటివి కొనసాగితే న్యాయపరంగా చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోనని తెలిపారు.
బీజేపీ జాతీయ అధ్యక్షులు జెపి.నడ్డా, పీఎంవో కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ ఆయన మాట్లాడిన అసలు వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఇటీవల ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నితిన్ గడ్కరీ తన గతానుభవాల్ని పంచుకుంటూ ఓ గ్రామానికి రోడ్డు వేసే సందర్భంగా అక్కడి అధికారులతో జరిగిన సంభాషణను గడ్కరీ ప్రస్తావించారు. జరుగుతున్న పర్యవసానాల గురించి నేను బాధపడను, కానీ నేను ఈపనిచేస్తాను.. వీలైతే తనకు అండగా నిలబడండి అని అధికారులతో గడ్కరీ అన్నారు. ఈ ఒక్క వాక్యాన్ని మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించినందుకే గడ్కరీ ఈవ్యాఖ్యలు చేశారంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులు సైతం ఈవ్యాఖ్యలను ప్రస్తావించారు. బీజేపీలో ఏదో దుమారం రేగుతోందని, గడ్కరీ అసంతృప్తితో ఉన్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ కూడా ఈ వీడియోను ట్వీట్ చేశారు. దీంతో గడ్కరీ ఈప్రచారంపై స్పందించారు. అసత్య ప్రచారాలు చేస్తే సహించేదే లేదని హెచ్చరించారు.
आधी हकीकत, आधा फसाना.. देखें किस तरह चार दिन पहले मुंबई में श्री नितिन गडकरी जी के वक्तव्य का प्रोपेगेंडा तैयार किया गया। pic.twitter.com/5j0I8lPtHR
— Office Of Nitin Gadkari (@OfficeOfNG) August 25, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..