Yaas Cyclone: వాయువేగంతో దూసుకువస్తున్న యాస్ తుఫాన్.. ప్రభావిత ప్రాంతాల్లో టెన్షన్.. టెన్షన్

Cyclone Yaas updates: రాకాసి తుఫాన్ దూసుకువస్తోంది. ఒక తుఫాన్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా.. యాస్‌ తుఫాన్‌ అలజడి రేపుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో

Yaas Cyclone: వాయువేగంతో దూసుకువస్తున్న యాస్ తుఫాన్.. ప్రభావిత ప్రాంతాల్లో టెన్షన్.. టెన్షన్
Cyclone Yaas Update
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 25, 2021 | 9:25 AM

Cyclone Yaas updates: రాకాసి తుఫాన్ దూసుకువస్తోంది. ఒక తుఫాన్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా.. యాస్‌ తుఫాన్‌ అలజడి రేపుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో ఈ రోజు తీవ్ర తుఫాన్‌గా మారి ఒడిశా తీరంవైపు దూసుకొస్తోందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఒడిషా.. సహా బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పలు తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇది బుధవారం ఉదయం అతి తీవ్ర తుఫాన్‌గా మారి పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ఒడిశా తీరాన్ని ఢీకొడుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.

తుఫాను ప్రభావంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి ఒడిషా, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, బెంగాల్ తదితర రాష్ట్రాల్లోని పలు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల తీరాల్లో సముద్రం అత్యంత కల్లోలంగా ఉంటుందని.. అప్రమత్తంగా ఉండాలంటూ ఐఎండీ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు ఒడిషా పలు తీరప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. ఒడిశాలో అత్యధిక బృందాలను తరలించారు.

కాగా.. యాస్‌ తుఫాన్‌‌పై ఇప్పటికే ప్రధాని మోదీ సమీక్షించిన విషయం తెలిసిందే. సోమారం దీనిపై హోం మంత్రి అమిత్ షా సైతం అధికారులతో సమీక్షించారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, తుఫాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఆర్‌ఎఫ్‌), ఆర్మీ, ఇతర విభాగాలు అప్రమత్తతో ఉండాలని సూచించారు.

Also Read:

Fuel Price Hike: మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఈ నెలలో ఎన్నిసార్లు పెరిగాయంటే..?

Minor Girl Suicide: మేనబావతో ప్రేమలో పడ్డ మైనర్ బాలిక.. పెళ్లికి నిరాకరించిన పెద్దలు.. అంతలోనే విషాదం..!