Fuel Price Hike: మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఈ నెలలో ఎన్నిసార్లు పెరిగాయంటే..?

Petrol Diesel Price Hiked: దేశంలో పెట్రో ధరలపై బాదుడు కొనసాగుతూనే ఉంది. ఇటీవల కాలంలో నిత్యం పెరుగుతున్న చమురు ధరలతో సామాన్యులు

Fuel Price Hike: మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఈ నెలలో ఎన్నిసార్లు పెరిగాయంటే..?
petrol diesel price hiked
Follow us

|

Updated on: May 25, 2021 | 8:53 AM

Petrol Diesel Price Hiked: దేశంలో పెట్రో ధరలపై బాదుడు కొనసాగుతూనే ఉంది. ఇటీవల కాలంలో నిత్యం పెరుగుతున్న చమురు ధరలతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. ఈ ఈ క్రమంలో మంగళవారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి. అంతకుముందు ఆదివారం ఇంధన ధరలు పెరిగాయి. అయితే.. ఒక రోజు విరామం తర్వాత చమురు కంపెనీలు ధరలను మళ్లీ పెంచాయి. ఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. తాజాగా చమురు కంపెనీలు పెట్రోల్‌ లీటర్‌కు 23 పైసలు, డీజిల్‌ లీటర్‌కు 27 పైసల వరకూ పెంచాయి.

పెంచిన ధరల ప్రకారం..

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.44 కి చేరగా.. డీజిల్‌ లీటర్ రూ.84.32కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబై నగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర వందకు చేరువైంది. పెట్రోల్‌ రూ.99.71, డీజిల్‌ రూ.91.57కు పెరిగింది. కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ.93.49, డీజిల్‌ రూ.87.16 కి పెరిగింది. చెన్నైలో పెట్రోల్‌ రూ.93.49, డీజిల్‌ 87,16కు చేరింది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.97.12, డీజిల్‌ రూ.91.92కు చేరింది. విజయవాడలో పెట్రోల్ ధర 99.77 ఉండగా.. డీజిల్ ధర 93.96 కి పెరిగింది.

ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధర రూ.100 దాటింది. మే నెలలో (25 రోజుల్లో ) ఇప్పటి వరకు 13 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఇప్పటి వరకు పెట్రోల్‌పై దాదాపు రూ.2.80, డీజిల్‌పై రూ.3పైగా పెంచాయి. పెట్రోల్ రిటైల్ అమ్మకపు ధరలో 60 శాతం, డీజిల్‌లో 54 శాతానికి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు విధిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు రూ.32.90, డీజిల్‌పై రూ .11.80 వసూలు చేస్తోంది. కరోనా కాలంలో పనుల్లేక ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ఇంధన ధరల పెరుగుదల మరింత పెనుభారమవుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:

Fungal Infections: ఫంగల్ ఇన్‌ఫెక్షన్లన్నీ ఒకటికాదు.. వాటికి రంగులేమిటి..? ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా..

Covid-19 vaccination: కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై కరోనా వ్యాక్సినేషన్‌కు ఆన్‌సైట్ రిజిస్ట్రేషన్.. కానీ..

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..