Fungal Infections: ఫంగల్ ఇన్‌ఫెక్షన్లన్నీ ఒకటికాదు.. వాటికి రంగులేమిటి..? ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా..
Randeep Guleria on Mucormycosis: ఫంగల్ ఇన్‌ఫెక్షన్లపై ఎయిమ్స్ డైరక్టర్ రణదీప్ గులేరియా కీలక ప్రకటన చేశారు. ఫంగల్ ఇన్‌ఫెక్షన్లను రంగులతో కాకుండా
Randeep Guleria on Mucormycosis: ఫంగల్ ఇన్‌ఫెక్షన్లపై ఎయిమ్స్ డైరక్టర్ రణదీప్ గులేరియా కీలక ప్రకటన చేశారు. ఫంగల్ ఇన్‌ఫెక్షన్లను రంగులతో కాకుండా వాటి పేర్లతోనే పిలవాలని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా పేర్కొన్నారు. అయితే.. ఒకే ఫంగస్‌కు వేర్వేరు రంగుల పేర్లను ఆపాదించడం వల్ల ఆయోమయం తలెత్తే ప్రమాదం ఉందని గులేరియా వెల్లడించారు. ఆక్సిజన్ థెరపీకి మ్యుకర్‌మైకోసిస్‌కు ఎలాంటి సంబంధం లేదంటూ ఆయన స్పష్టంచేశారు. ఆక్సిజన్ థెరపీ తీసుకుకోండా ఇంటి వద్దనే చికిత్స పొందిన వారికీ కూడా మ్యుకర్‌మైకోసిస్ సోకిందని గుర్తుచేశారు. మ్యుకర్‌మైకోసిస్‌ను బ్లాక్ ఫంగస్‌గా పిలువవద్దని.. అది వేరు ఇది వేరని.. అది సంక్రమిత వ్యాధి కాదని తెల్చిచెప్పారు. దీని బారిన పడిన వారిలో దాదాపు 90-95 శాతం మంది డయాబెటిక్ బాధితులు లేదా స్టెరాయిడ్స్ తీసుకున్నవారేనంటూ వివరించారు. మిగతావారికి ఇది సోకడం అరుదంటూ ఆయన పేర్కొన్నారు.
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి మ్యుకర్‌మైకోసిస్, కెండిడా, యాస్పర్జిలోసిస్ ఎక్కువగా సోకుతుంటాయని గులేరియా వివరించారు. యాంటీ ఫంగల్ చికిత్స వారాల తరబడి అందించాల్సి ఉంటుందని.. ఇదంతా ఆసుపత్రులకు సవాలేనంటూ పేర్కొన్నారు. కావున ఫంగల్ ఇన్‌ఫెక్షన్లను రంగులతో ఆపాదించడం సరికాదంటూ రణదీప్ గులేరియా వివరించారు.
Also Read: