AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19 vaccination: కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై కరోనా వ్యాక్సినేషన్‌కు ఆన్‌సైట్ రిజిస్ట్రేషన్.. కానీ..

Coronavirus vaccination: దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం

Covid-19 vaccination: కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై కరోనా వ్యాక్సినేషన్‌కు ఆన్‌సైట్ రిజిస్ట్రేషన్.. కానీ..
COVID-19 Vaccine India
Shaik Madar Saheb
|

Updated on: May 25, 2021 | 6:57 AM

Share

Coronavirus vaccination: దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 18-44 ఏళ్ల మధ్య వయసు గలవారు.. ముందస్తు పేరు నమోదు లేకుండానే టీకా కేంద్రాల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అర్హులైన లబ్ధిదారులు ఆన్‌సైట్‌ లేదా స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకొని స్లాట్‌ పొందవచ్చంటూ సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ ఒక కీలక ప్రకటన చేసింది.

దీనికోసం కేంద్ర ప్రభుత్వం కోవిన్‌ పోర్టల్‌లో మార్పులు చేసింది. ఈ సడలింపు కేవలం ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాలకే వర్తిస్తుందని, ప్రైవేట్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సిన్‌ వేసుకోవాలంటే ముందస్తు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరంటూ స్పష్టం చేసింది. అయితే ఆన్‌సైట్‌ రిజిస్ట్రేషన్‌పై తుది నిర్ణయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకే ఉంటుందని పేర్కొంది. వ్యాక్సిన్‌ షెడ్యూల్స్‌, స్లాట్ల వివరాలను ప్రైవేట్‌ టీకా కేంద్రాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో చూపించాలని ఆదేశించింది.

టీకా వృథాను తగ్గించేందుకే 18-44 మధ్య వయసు వారికి ఆన్‌సైట్‌ రిజిస్ట్రేషన్‌ అవకాశం కల్పించినట్టు కేంద్రం పేర్కొంది. వ్యాక్సిన్‌ కోసం ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారు.. ఒకవేళ ఆ సమయానికి కేంద్రానికి రాకపోతే ఆ రోజు వ్యాక్సిన్ డోసులు నిరుపయోగమవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని టీకా వృథాను తగ్గించేందుకు 18-44 ఏండ్ల వారికి ఆన్‌సైట్‌ రిజిస్ట్రేషన్‌కు అనుమతించామని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇంటర్నెట్‌ లేనివారికి, మొబైల్‌ ఫోన్స్‌ వాడకం తెలియనివారికి ఇది ఉపయోగపడుతుందని అధికారులు వెల్లడించారు. అయితే.. ఆన్‌సైట్‌ రిజిస్ట్రేషన్‌ సమయంలో ఎలాంటి రద్దీ లేకుండా చూసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.

Also Read:

Covid-19 vaccination: ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కోవిడ్ వ్యాక్సిన్.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం..

కరోనా రోగులకు పిడుగులాంటి వార్త… స్టెరాయిడ్సే కాదు…రెండెసివిర్‌తోనూ ఆ సమస్య