కరోనా రోగులకు పిడుగులాంటి వార్త… స్టెరాయిడ్సే కాదు…రెండెసివిర్‌తోనూ ఆ సమస్య

కరోనా మహమ్మారి జనం పాలిట శనిలా పరిణమిస్తోంది.  కరోనాకు చికిత్సలో భాగంగా చాలా మంది రోగులకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్నా..స్టెరాయిడ్స్ మందుల వాడకం కారణంగా వారిలో షుగర్ లెవల్స్ ఎక్కువగా నమోదవుతున్నాయి.

కరోనా రోగులకు పిడుగులాంటి వార్త... స్టెరాయిడ్సే కాదు...రెండెసివిర్‌తోనూ ఆ సమస్య
Remdesivir
Janardhan Veluru

| Edited By: Team Veegam

May 22, 2021 | 9:08 PM

కరోనా మహమ్మారి జనం పాలిట శనిలా పరిణమిస్తోంది.  కరోనాకు చికిత్సలో భాగంగా చాలా మంది రోగులకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్నా..స్టెరాయిడ్స్ మందుల వాడకం కారణంగా వారిలో షుగర్ లెవల్స్ ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో వారు షుగర్ పేషెంట్స్ గా మారిపోతున్నట్లు వైద్య అధ్యయనాలు వెల్లడించాయి. కరోనా బాధితులకు మరో  పిడుగులాంటి వార్త ఇది. కరోనా రోగులకు రెండెసివిర్(Remdesivir) మెడిసిన్‌ వాడినా…వారిలో షుగర్ లెవల్స్ బాగా పెరిగి ఇబ్బందులుపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు.

కరోనా తీవ్రత ఎక్కువగా ఉండే రోగులకు ఇప్పుడు ఆస్పత్రుల్లో రెండెసివిర్ మెడిసిన్‌ను విరివిరిగా వాడుతున్నారు. అందుకే దీనికి మార్కెట్లో తీవ్ర కొరత నెలకొంటోంది. కొందరు కేటుగాళ్లు కాసుల కక్కుర్తితో దీన్ని బ్లాక్ మార్కెట్‌‌లోనూ విక్రయిస్తున్నారు. రెండెసివిర్ మందులతో ఎందరో కోవిడ్ రోగుల ప్రాణాలను కాపాడగలుగుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మరో వైపు రెండెసివిర్ మందుల నుంచి కోలుకున్న వారిలో ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని వైద్యులు గుర్తించారు. రెండెసివిర్ మందులు వాడిన చాలా మంది రోగుల్లో షుగర్ లెవల్స్ ఎక్కువగా నమోదవుతున్నాయి.

Remdesivir

Remdesivir

దీంతో కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా కొందరు పేషెంట్స్ కొత్తగా మధుమేహ రోగులుగా మారుతుండగా…ఇది వరకే ఈ సమస్య ఎదుర్కొంటున్న వారిలో షుగర్ లెవల్స్ నియంత్రించలేని స్థాయికి చేరుకుంటున్నాయి. అందుకే ఇప్పుడు కోవిడ్ రోగులకు రెండెసివిర్‌తో చికిత్స కల్పించే విషయంలో చాలా మంది డాక్టర్లు పునరాలోచన చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కరోనా బారినపడిన షుగర్ పేషెంట్స్‌కు రెండెసివిర్ మెడిసిన్ వాడకపోవడమే ఉత్తమమని రాజస్థాన్‌లో నిర్వహించిన ఓ అధ్యయనంలో వైద్యులు తేల్చారు.

స్టెరాయిడ్స్‌తో పాటు రెండెసివిర్ వాడిన రోగుల్లో షుగర్ లెవెల్స్ 5 శాతం నుంచి 10 శాతం మేర ఎక్కువగా నమోదవుతున్నట్లు వైద్యులు తెలిపారు. అందుకే రెండెసివిర్ మెడిసిన్ రోగులకు ఇచ్చేపక్షంలో రోగుల షుగర్ లెవల్స్‌ను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా స్టెరాయిడ్స్‌తో పాటు రెండెసివర్ వాడే రోగుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటోందని తెలిపారు. సమస్య ఉన్న రోగుల్లో షుగర్ లెవల్స్‌ను కట్టడి చేసేందుకు ఇన్సులిన్ మోతాదును పెంచాలని సూచిస్తున్నారు.

అయితే స్టెరాయిడ్స్‌తో పాటు రెండెసివిర్ వాడినప్పుడు షుగర్ లెవల్స్ పెరగడం సహజమేనని మరికొందరు వైద్యులు అభిప్రాయపడుతున్నారు.. స్టెరాయిడ్స్‌ వాడకం ఆపేసిన తర్వాత రోగుల్లో షుగర్ లెవల్స్ సాధారణ స్థాయికి చేరుతాయని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి…గ్రీన్ టీ తాగితే బరువు తగ్గుతారా.. పాలు కలిపితే టీ గుణాలు పోతాయా? టీ డే సందర్భంగా కొన్ని విశేషాలు!

బటర్ మిల్క్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలిస్తే అసలు వదిలిపెట్టరు.!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu