International Tea Day: గ్రీన్ టీ తాగితే బరువు తగ్గుతారా.. పాలు కలిపితే టీ గుణాలు పోతాయా? టీ డే సందర్భంగా కొన్ని విశేషాలు!
International Tea Day: అరె భాయ్ చాయ్ తాగొద్దాం రా పోయి.. బ్రదరూ ఓ టీ తాగితే భలే ఉంటుంది కదూ.. అబ్బబ్బ ఉదయం నుంచి టీ తాగక తలనొప్పి వచ్చేస్తుంది అనుకో.. ఇలా టీ గురించి ఉదయం నుంచీ రాత్రివరకూ వింటూనే ఉంటాం.
International Tea Day: అరె భాయ్ చాయ్ తాగొద్దాం రా పోయి.. బ్రదరూ ఓ టీ తాగితే భలే ఉంటుంది కదూ.. అబ్బబ్బ ఉదయం నుంచి టీ తాగక తలనొప్పి వచ్చేస్తుంది అనుకో.. ఇలా టీ గురించి ఉదయం నుంచీ రాత్రివరకూ వింటూనే ఉంటాం. చాలామందికి టైం కి టీ పడకపోతే ఇంజన్ ఆగిపోతుంది. బుర్ర పనిచేయదు. మరికొంతమంది వేడి టీ తాగితే కానీ, ఇక చేస్తున్న పని ముందుకు వెళ్లదని చెబుతారు. టీ లో బోలెడు రకాలు. టీకొట్టు దగ్గర లెక్కలేనన్ని సరదా కబుర్లు. ఈరోజు (మే21) అంతర్జాతీయ టీ దినోత్సవం అందుకనే.. టీ గురించే ఇంత ఉపోద్ఘాతం. సరే.. ఈరోజు టీ గురించి కొన్ని విశేషాల్ని తెలుసుకుంటే భలే ఉంటుంది కదూ..రండి సరదాగా ఓ టీ తాగుతూ ఈ విశేషాల్ని చదివేయండి. టీ ఎలా చేస్తారు.. టీ ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ తెగ చదివేసి ఉంటారు. అందుకే, టీ గురించి మనం తరచు చెప్పుకునే ఓ ఐదు విషయాలు.. వాటిలోని వాస్తవాల గురించి చెప్పుకుందాం..
1. టీ పొడికి ఎక్స్పైరీ ఉండదు..
చాలామంది టీ పొడికి ఎక్స్పైరీ ఉండదు.. డబ్బాలో మూత పెడితే చాలు ఎన్నాళ్ళైనా పాడు అవదు అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. టీ పొడి కూడా ఎక్కువ కాలం నిల్వ ఉంచితే పాడైపోతుంది. టీ పొడి కొంచెం ముతక వాసనలా వస్తుంది అంటే పాడైపోయిందనే అర్థం. టీకి ఉండే సహజమైన వాసన కంటె ఏమాత్రం తేడాగా వాసన వచ్చినా (ఫ్లేవర్లు కలిపిన టీపొడి ఆ ఫ్లేవర్ వాసన ఉంటుంది) అది పాడైపోయిందని తెలుసుకోవచ్చు. వెంటనే ఆ డబ్బా బయట పాదేయడం బెటర్.
2. గ్రీన్ టీ ఒంట్లో కొవ్వును వెంటనే కరిగించేస్తుంది..
గ్రీన్ టీలో ఉన్న కాటెచిన్లు జీవక్రియను పెంచడానికి మరియు కొవ్వు కరిగించడానికి పనిచేస్తాయని అందరూ చెబుతారు. అందుకే గ్రీన్ టీ తాగితే చాలు కొవ్వు కరిగిపోతుందని చాలా మంది అనుకుంటారు. కానీ, రోజుకు ఓ పది కప్పులు టీ తాగి మంచం మీద పడుకుంటే కొవ్వు కరగదు. బరువు తగ్గాలి.. కొవ్వు కరగాలి అంటే.. వ్యాయామం కూడా తప్పనిసరి. ప్రతిరోజూ 2-3 కప్పుల గ్రీన్ టీతో పాటు, మీరు కూడా చాలా చెమట పట్టేలా వ్యాయం చేయాల్సి ఉంటుంది.
3. టీ పాలతో కంటె.. డికాక్షన్ తాగితేనే మంచింది..
బ్లాక్ టీ (డికాక్షన్ టీ) ఖచ్చితంగా బలంగా ఉంటుంది. టీకి పాలు జోడించడం టీ యొక్క ప్రయోజనాలను దెబ్బతీస్తుంది అనుకుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. వేడి టీ తమ చైనా కప్పుల్లో పగుళ్లను తీసుకువస్తుందని నమ్మిన బ్రిటీష్‌వాళ్ళు టీకి పాలు జోడించడం ప్రారంభించారని చెబుతారు. పాలు కలుపుకుంటే పానీయాన్ని కొంచెం చల్లబరుస్తుంది, అలాగే టీకి క్రీము రుచిని కూడా ఇస్తుంది. పాలు సహజ స్వీటెనర్ గా కూడా పనిచేస్తాయి.
4. డీకాఫిన్ చేసిన టీ లో కెఫిన్ ఉండదు..
ఇది తప్పు. డీకాఫిన్ చేయబడిన టీలో కూడా కెఫిన్ యొక్క ట్రేస్ మొత్తం ఉంటుంది, ఒక కప్పుకు సుమారు 2-10 మిల్లీగ్రాములు కెఫిన్ ఉంటుంది. మీరు కెఫిన్‌ను పూర్తిగా తగ్గించాలనుకుంటే, మీరు హెర్బల్ టీలను ఎంచుకోవచ్చు. మామూలు టీ కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటుంది.
5. టీ నిర్జలీకరణ చేస్తుంది..
అదనపు టీ మూత్రం పెరగడానికి కారణమవుతుంది. కానీ మీ శరీరం అవసరమైన ద్రవాలతో క్షీణిస్తుందని దీని అర్థం కాదు. అంతేకాకుండా, టీ వేడినీటితో తయారు చేస్తారు. పాలు కూడా కలుపుతాయి. అందువల్ల మీ ఆర్ద్రీకరణ అవసరాలను తీర్చడానికి ఇది మంచి పానీయం కావచ్చు. ఏదేమైనా, వేడి వేడిగా టీని ఎక్కువగా తాగడం అంత మంచిది కాదు.
టీ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు..
- టీ ప్రపంచంలోని పురాతన పానీయాలలో ఒకటి. అలాగే మంచి నీటి తర్వాత బాగా ప్రాచుర్యం పొందింది.
- ఈశాన్య భారతదేశం, ఉత్తర మయన్మార్ మరియు నైరుతి చైనాలో టీ ఉద్భవించిందని రికార్డులు చెబుతున్నాయి.
- 5,000 సంవత్సరాల క్రితం చైనాలో టీ తాగినట్లు ఆధారాలు ఉన్నాయి.
- టీ తోటలు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది సాగుదారులకు మరియు టీ ఎస్టేట్ కార్మికులకు ఉపాధి కల్పిస్తాయి.
- టీ ఉత్పత్తి, ప్రాసెసింగ్ యునైటెడ్ నేషన్స్ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో ఉన్నాయి. టీ పరిశ్రమ పేదరికం, ఆకలితో
- పోరాడటానికి సహాయపడుతుంది. ఇది మహిళల సాధికారతకు, పర్యావరణ వ్యవస్థల స్థిరమైన వినియోగానికి దోహదం చేస్తుంది.
- ఉత్పత్తి చేయబడిన టీలో సగానికి పైగా స్థానికంగా వినియోగిస్తుండగా, ఇది విస్తృతంగా ఎగుమతి అవుతుంది.
- సంవత్సరాలుగా, ప్రపంచవ్యాప్తంగా టీ పరిశ్రమ వేగంగా వృద్ధిని సాధించింది.
- యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) ప్రకారం అతిపెద్ద టీ ఉత్పత్తి చేసే దేశాలలో, టీ యొక్క తలసరి
- వినియోగం తక్కువగా ఉందట.
- టీ తాగడంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. టీ యాంటీ ఇన్ఫ్లమేటరీ అని నమ్ముతారు, యాంటీఆక్సిడెంట్ అలాగే గ్రీన్
- టీ బరువు తగ్గడానికి మంచిదని అంటారు.
- టీ అనేది కామెల్లియా సైనెసిస్ ప్లాంట్ నుండి తయారైన పానీయం.
అంతర్జాతీయ టీ దినోత్సవ శుభాకాంక్షలు!
Also Read: Butter Milk: బటర్ మిల్క్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలిస్తే అసలు వదిలిపెట్టరు.!