Viral Video : పాకిస్తాన్‌లో పిల్లలపై దాడి చేసిన సింహం..! క్రూర జంతువని తెలిసి అలా చేశారు.. వైరల్‌గా మారిన వీడియో..
Viral Video : పాకిస్తాన్‌లో జరిగిన ఈ సంఘటన మరోసారి చర్చనీయాంశమైంది. క్రూరజంతువులైన సింహాలను పెంచుకునే
Viral Video : పాకిస్తాన్‌లో జరిగిన ఈ సంఘటన మరోసారి చర్చనీయాంశమైంది. క్రూరజంతువులైన సింహాలను పెంచుకునే అలవాటు మరోసారి పాకిస్తాన్‌ను వార్తల్లో నిలిపింది. సాధారణంగా ప్రజలు కుక్కలు, పిల్లులను పెంచడానికి ఇష్టపడతారు. కానీ పాకిస్తాన్ ప్రజలు సింహాల వంటి ప్రమాదకరమైన జంతువులను కూడా పెంచుతారు. అటువంటి పరిస్థితిలో ప్రమాదం వారివెంటే ఉంటుంది. ఈ కేసు కరాచీలోని గుల్బర్గ్ నగరానికి చెందినది. ఇక్కడ ఒక వ్యక్తి తన పెంపుడు సింహాన్ని ఆరు బయట నడక కోసం తీసుకువెళ్ళాడు. ఆ సమయంలోనే దాని దగ్గరకు చిన్న పిల్లవాడు వచ్చి చూస్తున్నాడు. దీంతో సింహం ఒక్కసారిగా అతనిపై దాడి చేస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. ఇప్పుడు ఇది వైరలల్‌గా మారింది.
మే 14 న ఈ సంఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అరెస్టు చేసిన తరువాత సింహం యజమానిపై కేసు నమోదైంది. ప్రస్తుతం పిల్లవాడు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మీడియా కథనం ప్రకారం.. సింహం యజమానికి ఈ క్రూర జంతువును పెంచుకోవడానికి అనుమతి లేదని తెలిసింది. అంతర్జాతీయ మీడియా ఇచ్చిన నివేదిక ప్రకారం.. కరాచీ నగరంలో 300 కి పైగా సింహాలు ఉన్నట్లు అంచనా.
ఈ వీడియో చూడండి :
पाकिस्तान में शेर ने बच्चे पर किया अटैक pic.twitter.com/lgbBELfWlN
— @tweetbyjounralist (@kumarayush084) May 21, 2021