AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PPF account: పిల్లల పేరుతో పీపీఎఫ్ అకౌంట్‌ తీసుకునే అవకాశం ఉంటుందా.? నిబంధనలు ఏం చెబుతున్నాయి..?

PPF account: పిల్లల పేరుతో ప్రావిడెంట్‌ ఫండ్‌ అకౌంట్‌ (PPF)లో డబ్బులు జమ చేయవచ్చా..? కుదిరితే తల్లిదండ్రుల పేరుతో ఖాతాల్లో ఎంట్రీలు ఎలా చేస్తారు..?..

PPF account: పిల్లల పేరుతో పీపీఎఫ్ అకౌంట్‌ తీసుకునే అవకాశం ఉంటుందా.? నిబంధనలు ఏం చెబుతున్నాయి..?
Public Provident Fund (ppf)
Subhash Goud
|

Updated on: May 25, 2021 | 7:13 AM

Share

PPF account: పిల్లల పేరుతో ప్రావిడెంట్‌ ఫండ్‌ అకౌంట్‌ (PPF)లో డబ్బులు జమ చేయవచ్చా..? కుదిరితే తల్లిదండ్రుల పేరుతో ఖాతాల్లో ఎంట్రీలు ఎలా చేస్తారు..? సెక్షన్‌ 80 సీ కింద మినహాయింపుక్లెయిమ్‌ చేయాల్సిన అవసరం లేనప్పుడు ఎలా ముందుకెళ్లాలి..? మైనర్ల పేరుతో ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ (పీపీఎఫ్)లో డబ్బు జమ చేయవచ్చా? అలా కుదిరితే తల్లిదండ్రుల పేరుతో అకౌంట్లో ఎంట్రీలు ఎలా చేస్తారు? సెక్షన్ 80సీ కింద మినహాయింపును క్లెయిమ్ చేయాల్సిన అవసరం లేనప్పుడు ఎలా ముందుకెళ్లాలి? అనే సందేహాలు తరచూ ఎదురవుతుంటాయి. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ పథకం -2019 నిబంధనల ప్రకారం.. మైనర్‌ పేరుతో పీపీఎఫ్‌ అకౌంట్‌ తీసుకునే సదుపాయం ఉంది. ఈ పథకం కింద తల్లిదండ్రులు తమ పిల్లల పీపీఎఫ్‌ ఖాతాలో సొమ్ము జమ చేయడానికి ఎలాంటి అవరోధాలు, ఆంక్షలు లేవు. అయితే ఎవరైన వ్యక్తి తన ఖాతా లేదా మైనర్‌ లేదా ఇద్దరు పీపీఎఫ్‌ ఖాతాల్లో రూ.1.50 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని జమ చేసే అవకాశం లేదు. అందుకే సొంత ఖాతాలో జమ చేసేటప్పుడు పిల్లల ఖాతాకు కూడా వాటాను పంపవచ్చు.

అయితే ఈ రెండు ఖాతాల్లో డిపాజిట్ల మొత్తం రూ.1.50 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు. అంతకు మించి డబ్బు జమ చేసే వెసులుబాటు ఉండదు. అందువల్ల భార్యాభర్తలిద్దరూ పిల్లల పీపీఎఫ్‌ అకౌంట్‌లో భాగస్వామ్యం కావడానికి ఎంట్రీ లిమిట్‌ రూ.1.50 లక్షలకు మించి ఉండకూడదు. ఇందులో ఎలాంటి సమస్య ఉండదు. ఖాతా పుస్తకాల్లో మీ ఎంట్రీలు, కాంట్రిబ్యూషన్లకు సంబంధించినంత వరకు పిల్లలకు బహుమతి ఇస్తున్నట్లు చూపిస్తుంది. వారి పీపీఎఫ్ ఖాతాలో డిపాజిట్ చేసిన డబ్బుపై అంతే వడ్డీకి సంబంధించిన ఎంట్రీలు.. వారి ఖాతా బుక్‌ల్లో చూపిస్తాయి. తల్లిదండ్రుల పుస్తకాల్లో ఇవి కనిపించవు.

PPF పెట్టుబడులు..

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది పెట్టుబడి లేదా పన్ను ఆదా చేసుకునే సాధనం. దీర్ఘకాలికంగా పీపీఎఫ్ వడ్డీరేటు (ప్రస్తుతం 7.1 శాతం) పెట్టుబడుదారులు ద్రవ్యోల్బణాన్ని అధిగమించడంలో ఉపయోగపడుతుంది. కాబట్టి రిస్క్ ఫ్రీ పెట్టుబడి ఆప్షన్‌లలో పీపీఎఫ్ ముఖ్యమైనది. అంతేకాకుండా దీని మెచ్యురిటీ వ్యవధి 15 సంవత్సరాలు ఉంటుంది. పీపీఎఫ్ నిబంధనలు ప్రకారం ఈ మెచ్యురిటీ పీరియడ్‌కు ముందే పెట్టుబడిదారులకు డబ్బు విత్ డ్రా చేసుకునే అవకాశముంది. ఒక శాతం వడ్డీ రేటుతో పీపీఎఫ్ లోన్ తీసుకోవడానికి కూడా అనుమతిస్తుంది. ఇలా పీపీఎఫ్‌ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అయితే అందరికి కొన్ని నిబంధనలు తెలియవు. వీటిని తెలుసుకుంటే ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి.

ఇవీ చదవండి:

PhonePe Indus: ఫోన్‌ పే చేతికి కంటెంట్‌, యాప్‌ డిస్కవరీ ప్లాట్‌ఫామ్‌ ఇండస్‌ ఓఎస్‌.. డీల్‌ అంచనా రూ.440 కోట్లు

Health Insurance: ప్రీమియం రెన్యువల్‌ రేటు పెరిగిందా..? మీ పాలసీని వేరే సంస్థకు ఇలా బదిలీ​ చేసుకోండి