AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోవిద్ రోగుల డెత్ సర్టిఫికెట్లపైనా ప్రధాని మోదీ ఫోటోలు ఉంచాలట, బీజేపీ ‘మిత్ర పక్ష’ నేత పిలుపు, పొరబాటైందని ట్వీట్ తొలగింపు

వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ ఫోటో ఉంచాలన్న బీజేపీ ప్రతిపాదన మొదట్లోనే వివాదం రేపగా ఇప్పుడు మరొకరు ఇలాంటి కాంట్రోవర్సీ ని లేపారు.

కోవిద్ రోగుల డెత్ సర్టిఫికెట్లపైనా ప్రధాని మోదీ ఫోటోలు ఉంచాలట,  బీజేపీ 'మిత్ర పక్ష' నేత పిలుపు,  పొరబాటైందని ట్వీట్ తొలగింపు
Modi
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: May 25, 2021 | 9:58 AM

Share

వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ ఫోటో ఉంచాలన్న బీజేపీ ప్రతిపాదన మొదట్లోనే వివాదం రేపగా ఇప్పుడు మరొకరు ఇలాంటి కాంట్రోవర్సీ ని లేపారు. కోవిద్ రోగుల డెత్ సర్టిఫికెట్లపై కూడా ఆయన ఫోటోలు ఉంచాలని బీజేపీ మిత్ర పక్షమైన హిందుస్తానీ అవామీ మోర్చా (సెక్యులర్) చీఫ్, బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంజీ ట్వీట్ చేశారు. స్వామి భక్తి పరాయణుల్లో తానూ ఒకరని నిరూపించుకున్నారు. వ్యాక్సిన్ ధ్రువ పత్రాల్లో మోదీ ఫోటో ఉండాలని భావిస్తే అదే సమయంలో కోవిద్ రోగుల డెత్ సర్టిఫికెట్ల మీద కూడా ఉండాలనడం సముచితమే అన్నారాయన.. అయితే ఆ తరువాత ఈ ట్వీట్ ని తొలగించారు. కానీ అప్పటికే ఇది వివాదాస్పదమైంది. ఈ మధ్యే ఈయన వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల్లపై రాష్ట్రపతి ఫోటో కూడా పెట్టవచ్చునని, అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల ఫోటోలు ఉంచితే తప్పేమిటని కూడా అన్నారు. మోదీ ఫోటో వ్యవహారంపై వివాదం రేగడం ఇది రెండోసారి. కాగా 18-44 ఏళ్ళ మధ్య వయస్కులకు వ్యాక్సినేషన్ చేయించినప్పుడు వారికి జారీ చేసిన సర్టిఫికెట్లపై ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం తమ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ ఫోటోను ముద్రించింది. ఝార్ఖండ్ లో సీఎం హేమంత్ సొరేన్ ముఖచిత్రంకూడా ఈ సర్టిఫికెట్లపై దర్శజనమిచ్చింది.

కాగా బీహార్ ప్రతిపక్షం ఆర్జేడీ.. జితన్ రామ్ మాంజీ కామెంట్లపై వ్యంగ్యంగా స్పందించింది. డెత్ సర్టిఫికెట్లపై మోడీ ఫోటోలు ఉండాలనే తాము కూడా చెబుతున్నామని, అందువల్ల మీరు ఎన్డీయే కి గుడ్ బై చెప్పాలని ఈ పార్టీ ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ సెటైర్ వేశారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Volcanic Eruption: కాంగో అగ్నిపర్వతం విస్ఫోటనం.. 32కు చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయచర్యలు

Yaas Cyclone: వాయువేగంతో దూసుకువస్తున్న యాస్ తుఫాన్.. ప్రభావిత ప్రాంతాల్లో టెన్షన్.. టెన్షన్