Fengal Cyclone: తీరం దాటిన ఫెయింజల్ తుపాన్.. ఆ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు.. స్కూళ్లకు సెలవులు..

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుఫాన్ తీరం దాటింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మధ్య కారైకాల్ మహాబలిపురం వద్ద తుఫాన్ తీరం దాటింది. ఫెయింజల్ తుఫాన్ హడలెత్తించింది.. తమిళనాడు, పుదుచ్చేరిపై విరుచుకుపడింది.. దీంతో భారీ వర్షాలు, వరదలతో ఇరు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి..

Fengal Cyclone: తీరం దాటిన ఫెయింజల్ తుపాన్.. ఆ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు.. స్కూళ్లకు సెలవులు..
Cyclonic Storm Fengal
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 01, 2024 | 6:59 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుఫాన్ తీరం దాటింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మధ్య కారైకాల్ మహాబలిపురం వద్ద తుఫాన్ తీరం దాటింది. ఫెయింజల్ తుఫాన్ హడలెత్తించింది.. తమిళనాడు, పుదుచ్చేరిపై విరుచుకుపడింది.. దీంతో భారీ వర్షాలు, వరదలతో ఇరు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి.. ఈ క్రమంలో ఫెయింజల్ తుఫాన్ శనివారం రాత్రి 10:30 నుంచి 11:30 మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరందాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ-నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీన పడనుందని.. ఈ నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఫెయింజల్‌ తుఫాన్‌ తమిళనాడును వణికిస్తోంది. తమిళనాడులో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వణికిస్తోంది. నార్త్‌ తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటిన తుఫాన్‌.. కుండపోత వర్షాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తీరం వెంబడి 100 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.. భారీ వర్షాలతో చెన్నై జలసంద్రంగా మారింది.. చెన్నైతో పాటు 6 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.. ఈదురుగాలులు, వర్ష బీభత్సంతో చెన్నై ఎయిర్‌పోర్ట్‌ మూతపడింది. చెంగల్‌పట్టు, మహాబలిపురం, కడలూరులో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్‌ బీభత్సంతో చెన్నైలో జనజీవనం స్తంభించింది. వరదల ధాటికి రహదారులు చెరువులుగా మారాయి. వరదనీటిలో వాహనదారుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. తుఫాన్‌ భయంతో… ఫ్లై ఓవర్లపై కార్లను పార్కింగ్‌ చేశారు. చెన్నైలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. చెన్నై ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. తుఫాను ప్రభావంపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఏపీలో భారీ వర్షాలు..

ఫెయింజల్ తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతోపాటు నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలతోపాటు మరికొన్ని చోట్ల కూడా వర్షాలు కురుస్తాని తెలిపింది. ఇప్పటికే.. ఫెయింజల్‌ ప్రభావంతో నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి..

తీరం వెంబడి 70-90 కి.మీ.వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మికంగా వరదలు వచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట తడ, దొరవారిసత్రం, నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. తుఫాన్ ప్రభావంతో.. గూడూరు, కోట, వాకాడు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై-తడ జాతీయ రహదారిపై భారీగా వర్షపునీరు చేరింది.

లైవ్ ట్రాకింగ్..