Exams in December Month: టీజీపీఎస్సీ గ్రూప్ 2తో సహా డిసెంబర్ నెలంతా ఉద్యోగ పరీక్షలే.. ఏయే తేదీల్లో ఉన్నాయంటే?
దేశ వ్యాప్తంగా పలు ఉద్యోగ పరీక్షలు, ఎంట్రన్స్ టెస్ట్ లు డిసెంబర్ నెలలో జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఈ కింద ఇచ్చాం. ఏ తేదీన ఏ పరీక్ష ఉంటుందో తెలుసుకుంటే.. ఆ ప్రకారంగా పరీక్షలకు సన్నద్ధమవడానికి అవకాశం ఉంటుంది..
హైదరాబాద్, డిసెంబర్ 1: నవంబర్ నెల ముగిసింది. ఈ రోజు నుంచి డిసెంబర్ మొదలవుతుంది. డిసెంబర్ నెలంతా వివిధ పోటీ, నియామక పరీక్షలు జరగనున్నాయి. తొలి రోజు నుంచే దేశ వ్యాప్తంగా పలు పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర నియామక సంస్థలు, విద్యా సంస్థలు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు, ప్రవేశాలకు నోటిఫికేషన్‌లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అర్హులైన అభ్యర్థులు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తి చేసుకుని, పరీక్షలకు ముమ్మరంగా సన్నద్ధమవుతున్నారు. డిసెంబర్ 1వ తేదీన క్లాట్ 2025, ఐడీబీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ పరీక్షలు జరుగుతాయి. తెలంగాణ టీజీపీఎస్సీ గ్రూప్-2తో సహా ఆర్‌ఆర్‌బీ, ఏపీ ఎన్‌ఎంఎంఎస్ ఎగ్జామ్, ఎస్‌ఎస్‌సీ జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఎగ్జామ్, సీటెట్ వంటి పలు పలు ఉద్యోగ, ప్రవేశ ప్రకటనలకు సంబంధించి పరీక్షలు డిసెంబర్ నెలంతా జరగనున్నాయి.
డిసెంబర్ నెలలో జరిగే ముఖ్యమైన పరీక్షలు, వాటి తేదీల వివరాలు ఇవే…
- క్లాట్ 2025 పరీక్ష డిసెంబర్ 1 తేదీన జరుగుతుంది.
- ఐడీబీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ పరీక్ష డిసెంబర్ 1 తేదీన జరుగుతుంది.
- ఆర్‌ఆర్‌బీ ఆర్‌పీఎఫ్ ఎస్సై పరీక్ష డిసెంబర్ 2, 3, 9, 12, 13 తేదీలో జరుగుతుంది.
- యూబీఐ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పరీక్ష డిసెంబర్ 4 తేదీన జరుగుతుంది.
- ఏపీ ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష డిసెంబర్ 8 తేదీన జరుగుతుంది.
- ఎస్‌ఎస్‌సీ జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పరీక్ష డిసెంబర్ 9 తేదీన జరుగుతుంది.
- ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ పరీక్ష డిసెంబర్ 10, 11 తేదీలో జరుగుతుంది.
- సీటెట్ డిసెంబర్ 2024 పరీక్ష డిసెంబర్ 14 తేదీన జరుగుతుంది.
- ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ మెయిన్స్ పరీక్ష డిసెంబర్ 14 తేదీన జరుగుతుంది.
- టీజీపీఎస్సీ గ్రూప్-2 ఎగ్జామ్ డిసెంబర్ 15, 16 తేదీలో జరుగుతుంది.
- ఆర్‌ఆర్‌బీ జూనియర్ ఇంజినీర్ పరీక్ష డిసెంబర్ 16, 17, 18 తేదీలో జరుగుతుంది.
- ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్ (గ్రేడ్-1, 3) ఎగ్జామ్ డిసెంబర్ 19, 20, 23, 24, 26, 28, 29 తేదీలో జరుగుతుంది.
- తెలంగాణ ఎంపీహెచ్‌ఏ(ఎఫ్) పరీక్ష డిసెంబర్ 29 తేదీన జరుగుతుంది.