AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Chairman: 11 నెలలకే దిగిపోతున్న టీజీపీఎస్సీ ఛైర్మన్‌ మహేందర్‌రెడ్డి.. కారణం అదేనా?

కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీజీపీఎస్సీ ఛైర్మన్​గా జనవరిలో మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డి.. బాధ్యతలు స్వీకరించిన కేవలం 11 నెలలకే ఛైర్మన్ పదవి నుంచి నుంచి వైదొలగుతున్నారు. డిసెంబర్ 3వ తేదీన ఆయన వైదొలగి.. ఐఏఎస్ ఆఫీసర్ బుర్రా వెంకటేశం ఆ పదవిని స్వీకరించనున్నారు..

TGPSC Chairman: 11 నెలలకే దిగిపోతున్న టీజీపీఎస్సీ ఛైర్మన్‌ మహేందర్‌రెడ్డి.. కారణం అదేనా?
TGPSC Chairman
Srilakshmi C
|

Updated on: Dec 01, 2024 | 7:39 AM

Share

హైదరాబాద్‌, డిసెంబర్‌ 1: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన ఛైర్మన్‌గా ఐఏఎస్ ఆఫీసర్‌ బుర్రా వెంకటేశం నియమితులైన సంగతి తెలిసిందే. బుర్రా వెంకటేశం నియామక ఫైల్‌పై గవర్నర్ జిష్టుదేవ్​ వర్మ సంతకం చేశారు కూడా. ఈ మేరకు డిసెంబర్‌ 3న ఆయన ఆ పదవిని చేపట్టనున్నారు. అయితే ప్రస్తుత టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా కొనసాగుతున్న మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3తో ముగియనుంది. ఈ నేపథ్యంలో బుర్రా వెంకటేశం ఐఏఎస్‌కు కొలువుకు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయనున్నారు. 1995 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన బుర్రా వెంకటేశం సర్వీస్​ 2028 ఏప్రిల్ 10 వరకు ఉంది. టీజీపీఎస్సీ ఛైర్మన్​గా ఆయన 2030 ఏప్రిల్ 10 వరకు కొనసాగే అవకాశం ఉంది.

11 నెలలకే దిగిపోతున్న టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి జనవరి 25న బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆ పదవిలో యాన కేవలం11నెలల పాటే కొనసాగారు. టీఎస్‌పీఎస్‌పీ నిబంధనల ప్రకారం చైర్మన్‌గా, కమిషన్‌ సభ్యులుగా నియమితులైనవాళ్లు 62 ఏళ్ల వయసు వరకు మాత్రమే ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. అలాగే 6 యేళ్ల పాటు గరిష్టంగా ఆ పదవిలో కొనసాగవచ్చు. 1962లో డిసెంబర్‌3న జన్మించిన మహేందర్‌రెడ్డి.. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించే నాటికి ఆయన వయసు 61 సంవత్సరాల 1 నెల 22 రోజులు. దీంతో మరో 11 నెలలు గడిస్తే ఆయనకు 62 ఏళ్లు వచ్చేస్తాయ్‌. ఈ నేపథ్యంలోనే చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి 11 నెలల అనంతరం డిసెంబర్ 3వ తేదీన టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బాధ్యతల నుంచి వైదొలగున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీజీపీఎస్సీ ఛైర్మన్​గా జనవరిలో మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డిని నియమించింది. ఆయనతో పాటు మరో ఐదుగురు టీజీపీఎస్సీ సభ్యులుగా నియమితులయ్యారు. అప్పటి గవర్నర్​ తమిళిసై ఆమోద ముద్ర వేయడంతో వారంతా బాధ్యతలు స్వీకరించారు. ఇక ఐఏఎస్‌ ఆఫీసర్‌ బుర్రా వెంకటేశం విషయానికొస్తే.. జనగామ జిల్లాకు చెందిన ఆయన ప్రస్తుతం విద్యాశాఖ, గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. మరో రెండు రోజుల్లో బుర్రావెంకటేశంను నూతన ఛైర్మన్​గా నియమించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
పూల్వామా దాడి సూత్రధారి హతం..
పూల్వామా దాడి సూత్రధారి హతం..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?