Cow as National Animal: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి.. కేంద్రానికి అలహాబాద్ హైకోర్టు కీలక సూచన..

కేంద్ర ప్రభుత్వానికి అలహాబాద్ హైకోర్టు  కీలక సూచన చేసింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్రానికి కోరింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడంతోపాటు.. గోసంరక్షణను హిందువుల ప్రాథమిక హక్కుగా చేయాలని

Cow as National Animal: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి.. కేంద్రానికి అలహాబాద్ హైకోర్టు కీలక సూచన..
Inter State Cow Gang
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 01, 2021 | 8:00 PM

కేంద్ర ప్రభుత్వానికి అలహాబాద్ హైకోర్టు  కీలక సూచన చేసింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్రానికి కోరింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడంతోపాటు.. గోసంరక్షణను హిందువుల ప్రాథమిక హక్కుగా చేయాలని పేర్కొంది. గోవధలో నిందితుడైన జావేద్ బెయిల్ పిటిషన్‌ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. గో వధ చట్టాన్ని ఉల్లంఘించిన జావేద్‌‌కు బెయిల్ ఇచ్చేందుకు అలహాబాద్ హైకోర్టు బుధవారం తిరస్కరించింది. బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతున్న సందర్భంలో కోర్టు పలు సూచనలను కూడా చేసింది. ఆవులను మతపరమైన కోణం నుండి మాత్రమే చూడరాదని.. ఆవును గౌరవించడం, రక్షించడం భారత జాతి విధి అని పేర్కొంది.

జాతీయ జంతువుగా ప్రకటించండి..

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని అలహాబాద్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఆవులకు జాతీయ జంతువు హోదా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు తీసుకురావాలని కోర్టు పేర్కొంది. దేశంలో ఆవులు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే దేశ కూడా సంతోషంగా ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో ఆవు ముఖ్యమైనది. ఆవుకు సంబంధించి పార్లమెంట్ చేసిన చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని కోర్టు పేర్కొంది.

గతంలో రాజస్థాన్ హైకోర్టు కూడా ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరిన సంగతి తెలిసిందే… కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ మహేశ్ చంద్ శర్మ సింగిల్ బెంచ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,అడ్వకేట్ జనరల్‌ని ఆవును చట్టపరమైన సంరక్షకుడిగా నియమించింది.

కొన్ని సంవత్సరాల క్రితం ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని జమియత్ ఉలేమా-ఇ-హింద్ జాతీయ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ డిమాండ్ చేసిన సంగతి గుర్తుండి ఉంటుంది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే.. ఆవులు, మానవులు సురక్షితంగా ఉంటారని చెప్పారు. “ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడానికి ఒక చట్టం చేయండి. ఆవిధంగానైనా ఆవులు, మానవ జీవితాలు రెండూ సురక్షితంగా ఉంటాయి. ఈ దేశానికి ఉపయోగకరంగా ఉంటుంది” అన్నారు.

ఇవి కూడా చదవండి:  Pub Culture: అక్కడ రూల్స్.. గీల్స్ జాన్తానై.. పబ్బుల్లో నిబంధనలు గాలికి.. చిన్నారులను కూడా అనుమతిస్తున్న వైనం..

Afghanistan Crisis: పంజ్‌షేర్‌ వ్యాలీలో తాలిబన్లకు వరుస ఎదురుదెబ్బలు.. తాజాగా 350 మంది హతం.. కీలక ప్రకటన చేసిన నార్తర్న్‌ అలయెన్స్‌..