India Corona: కనికరించని కరోనా.. క్రమంగా పెరుగుతున్న యాక్టివ్‌ కేసులు.. నిన్న ఎంత మంది వైరస్‌ బారిన పడ్డారంటే..

Covid19 Updates: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు 18వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో

India Corona: కనికరించని కరోనా.. క్రమంగా పెరుగుతున్న యాక్టివ్‌ కేసులు.. నిన్న ఎంత మంది వైరస్‌ బారిన పడ్డారంటే..
Coronavirus
Follow us
Basha Shek

|

Updated on: Jul 08, 2022 | 10:52 AM

Covid19 Updates: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు 18వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 18, 815 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల సంఖ్య గురువారంతో పోలిస్తే 100కు పైగా కేసులు తగ్గాయి. కొత్త కేసులతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,35,85,554 కు చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,22,335గా ఉంది. తాజాగా 38 మంది కరోనాతో మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 5,25,343 కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 15, 899 మంది కరోనా నుంచి కోలు కున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం రికవరీల సంఖ్య 4,29,37,876 కు చేరింది. రికవరీ రేటు 98.51 వద్ద స్థిరంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.27 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.96 శాతానికి పెరిగింది.

కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, కర్టాటక రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇక కరోనా కట్టడికి దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చురగ్గా కొనసాగుతోంది. గురువారం మరో 17,62,441 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,98,51,77,962కు చేరింది. ప్రపంచదేశాల్లోనూ కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 9,25,494 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 1,725 మంది మహమ్మారితో ప్రాణాలు విడిచారు. ఫ్రాన్స్‌, జర్మనీ, బ్రెజిల్‌, అమెరికాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!
ప్రయాగ్ రాజ్ కు వెళ్తున్నారా.. ఈ ప్రాచీన దేవాలయాలపై ఓ లుక్ వేయండి
ప్రయాగ్ రాజ్ కు వెళ్తున్నారా.. ఈ ప్రాచీన దేవాలయాలపై ఓ లుక్ వేయండి