Japan Ex PM Shot: భారత ప్రధానికి ఆత్మీయ మిత్రుడు.. షింజో అబేపై కాల్పులను ఖండించిన మోదీ..
ప్రధాని మోదీని తన ఆత్మీయ స్నేహితుడిగా పిలుచుకునేవారు షింజో అబే. ఆయనతో భారత్‌కు ఉన్న స్నేహం కారణంగా దేశంలోని రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌తో సత్కరించింది.
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై దాడి జరగడాన్ని భారత్ ఖండించింది. ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “నా ప్రియ మిత్రుడు అబే షింజోపై జరిగిన దాడితో తీవ్ర మనోవేదనకు గురయ్యాను. తామంతా అతని కుటుంబంతో..జపాన్ ప్రజలతో ఉన్నామంటూ.. ట్విట్టర్‌లో పేర్కొన్నారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపైకు భారత్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. షింజో అబే నరేంద్రమోదీకి మిత్రుడు. గత ఏడాది షింజోను పద్మవిభూషణ్‌తో సత్కరించింది భారత ప్రభుత్వం. ఈ ఇద్దరు నేతల మధ్య వ్యక్తి స్నేహం కూడా ఉంది. షింజో అబే ప్రధానమంత్రిగా భారతదేశానికి వచ్చినప్పుడు.. షింజో అబే వారణాసి దర్శనానికి ప్రధాని మోదీ తీసుకెళ్లారు. ఇద్దరు దేశాధినేతలు కలిసి గంగా హారతిలో పాల్గొన్నారు. ఈ సమయంలో భారతీయ సంస్కృతి, నాగరికత పట్ల షింజో అబే తన ఆప్యాయత వెల్లడించారు. షింజో అబే భారతీయ సంప్రదాయాలపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తనకు అత్యంత విశ్వసనీయ స్నేహితుల్లో నరేంద్ర మోదీ ఒకరు అని గతంలో చాలాసార్లు జపాన్ ప్రధాని షింజో అబే ప్రకటించిన సంగతి తెలిసిందే. షింజో అబే భారతదేశం నుంచి బయలుదేరుతూ.. తనకు మంచి స్నేహితుడు అంటే ప్రధాని మోదీ అని అన్నారు. ఈ సందర్భంలో షింబో అబేకు ప్రధాని నరేంద్ర మోడీ భగవద్గీతను అందించారు.
Deeply distressed by the attack on my dear friend Abe Shinzo. Our thoughts and prayers are with him, his family, and the people of Japan.
— Narendra Modi (@narendramodi) July 8, 2022
జపాన్ లో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన రికార్డు షింజోది. 2006లో ఏడాది పాటు అబే ఏడాది పాటు ప్రధానమంత్రి పదవిలో కొనసాగారు. 2012 నుంచి 2020 వరకు కూడా ఆయన ఈ పదవిలో ఉన్నారు. జపాన్ ప్రధానమంత్రి పదవికి షింజో అబే 2020 ఆగస్టు 28న రాజీనామా చేశారు. కొన్ని సంవత్సరాలుగా అబే దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన అనారోగ్యం ప్రభుత్వానికి సమస్యలు సృష్టించొద్దనే కారణంతోనే ఆయన రాజీనామా చేశారు. అల్సరేటివ్ కొలిటిస్ వ్యాధితో కొన్ని ఏళ్లుగా పోరాడుతున్న అబే.. సుదీర్ఘ కాలం ప్రీమియర్‌గా పని చేసిన నేతగా.. 50 ఏళ్ల క్రితం తన తాత ఇసాకు సాటో క్రియేట్ చేసిన రికార్డును తనే బ్రేక్ చేశారు.
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు నేతాజీ అవార్డ్
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి పురస్కరించుకుని నేతాజీ అవార్డు 2022ను ప్రకటించింది నేతాజీ రీసెర్చ్ బ్యూరో. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు ఈ అవార్డ్ ను ప్రధానం చేసింది. ఈ మేరకు కోల్‌కతాలోని ఎల్గిన్ రోడ్ లో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ నివాసంలో వర్చువల్ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ అవార్డును అందించారు. కోల్‌కతాలోని జపాన్ కాన్సుల్ జనరల్ నకమురా యుటాకా.. అబే తరపున ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా.. షింబో అబే మాట్లాడుతూ.. ఈ అవార్డ్ రావడం గర్వంగా ఉందని అబే ఒక ప్రకటనలో తెలిపారు. ఎంతో పుణ్యం చేసుకొని ఉంటే ఇంతటి గౌరవం దక్కుతుందని ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
భారతదేశంతో ప్రత్యేక సంబంధం
షింజో అబేకు భారతదేశం పట్ల ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన తన పదవీకాలంలో అత్యధికంగా భారతదేశాన్ని సందర్శించిన ఏకైక జపాన్ ప్రధాన మంత్రిగా నిలిచారు. 2006-07లో షింజో అబే తన మొదటి పదవీకాలంలో మొదటిసారి భారతదేశానికి వచ్చారు. ఆ తర్వాత, షింజో అబే 2012-20లో తన రెండవ టర్మ్‌లో మూడుసార్లు భారతదేశంలో పర్యటించారు. ఈ మూడు పర్యటనలు 2014, 2015, సెప్టెంబర్ 2017 సంవత్సరాలలో జరిగాయి.
భారతదేశానికి బుల్లెట్ రైలు బహుమతిని అందించారు..
నేడు భారతదేశంలో దూసుకుపోతున్న బుల్లెట్ రైలుకు మార్గం సుగమం చేసిన నాయకుడు షింజో అబే. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం జపాన్ ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువ రేటుకు భారతదేశానికి అందించారు. అదే సమయంలో రుణ చెల్లింపు సమయం కూడా 25 సంవత్సరాలకు బదులుగా 50 సంవత్సరాలుగా ఉంచారు. భారత్‌ను విశ్వగురువుగా చూడాలని షింజో అబే కోరుకున్నారు. ప్రధాని మోదీతో షింబో అబేకు ఉన్న అనుబంధమే దీనికి కారణమని చాలా సార్లు వెల్లడించారు.
ఎన్నికల ప్రచారంలో ఉండగా కాల్పులు..
జపాన్‌లో ఎగువసభకు ఆదివారం ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా నరాలో షింజో అబే ప్రచారం చేస్తున్న సమయంలో దుండుగుడు కాల్పులకు దిగాడు. జపాన్‌లో తుపాకులపై నిషేధం ఉంది. ఇలాంటి సమయంలో మాజీ ప్రధానిపై కాల్పులకు దిగడం కలకలం రేపింది. జపాన్‌లో అత్యంత తుపాకీ నియంత్రణ చట్టాలున్నాయి. జపాన్ లో తుపాకీ లైసెన్స్ పొందాలంటే అంత సులభం కాదు. తొలుత షూటింగ్ అసోసియేషన్ నుంచి సిఫారసును పొందాలి. ఆ తర్వాత పోలీసులు కఠినమైన నిబంధనలను దాటుకొని తుపాకీ లైసెన్స్ ను పొందుతారు.