JN.1 Variant: కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా.. JN.1 వేరియంట్‌కు పని చేస్తుందా? నిపుణులు ఏమి చెబుతున్నారంటే

చాలా వేరియంట్ కేసులు ఫ్లూ మాదిరిగానే ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ వైవిధ్యాన్ని తీవ్రంగా పరిగణించలేదు. WHO, CDC రెండూ కరోనా వైరస్ కొత్త ఉప-వేరియంట్ JN.1ని నిరోధించడంలో ప్రస్తుత కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావవంతంగా ఉందని నిర్ధారించాయి. JN.1 రూపాంతరం Omicron కి చెందిన ఉప-వేరియంట్ కాబట్టి.. ఇప్పటికే ఉన్న టీకా ఈ వేరియంట్ ప్రభావాన్ని తగ్గించగలదు.

JN.1 Variant: కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా.. JN.1 వేరియంట్‌కు పని చేస్తుందా? నిపుణులు ఏమి చెబుతున్నారంటే
Covid Vaccine
Follow us

|

Updated on: Dec 21, 2023 | 3:07 PM

కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది మొదలు ప్రపంచ దేశాలు వణుకుతూనే ఉన్నాయి. దాదాపు రెండేళ్లు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన కరోనా తగ్గినట్లే తగ్గి.. మళ్ళీ విజృంభించడం మొదలు పెట్టింది. అవును మనదేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. క్రియాశీల రోగుల సంఖ్య 2669కి పెరిగింది. గత వారం నుండి ప్రతిరోజూ యాక్టివ్ పేషెంట్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కొత్త సబ్-వేరియంట్ JN.1 దేశంలో కరోనా కేసుల పెరుగుదలకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఈ వేరియంట్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మళ్ళీ కోవిడ్ వ్యాప్తి గురించి ఆందోళన పెరిగింది. ప్రభుత్వ నిపుణులు, మైక్రోబయాలజీ విభాగం బృందం, జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్న ల్యాబ్ ఈ వేరియంట్‌పై పని చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ JN. 1 వేరియంట్ కు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఈ వైరస్ వైవిధ్యంగా ఉందని వెల్లడించింది. అయితే ఈ వేరియంట్ వలన తీవ్రమైన ముప్పు ఉండదని పేర్కొంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వేరియంట్‌ల కారణంగా.. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది.

సింగపూర్ , అమెరికా సహా అనేక దేశాలతో పాటు భారతదేశంలో కూడా JN.1 వేరియంట్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. ప్రారంభ దశలో ఈ వైరస్ బారిన పడిన రోగులలో తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. కోవిడ్‌ వైరస్‌ తన రూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. ఈ క్రమంలో, JN.1 వేరియంట్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇది BA.2.86  ఉప-వేరియంట్. భారతదేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నందున వ్యాక్సిన్ గురించి మరోసారి చర్చ ప్రారంభమైంది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ కరోనా కొత్త సబ్-వేరియంట్ JN.1పై ప్రభావవంతంగా ఉంటుందా అనేది ఈ సమయంలో ప్రజల మదిలో ఉన్న పెద్ద ప్రశ్న. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

ప్రస్తుత వ్యాక్సిన్ ప్రభావవంతంగా ఉంటుందా?

మాక్స్ హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్ HOD డాక్టర్ రాజీవ్ డాంగ్, TV9 తో మాట్లాడుతూ కొత్త వేరియంట్ JN గురించి అనేక విషయాలను పంచుకున్నారు. చాలా వేరియంట్ కేసులు ఫ్లూ మాదిరిగానే ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ వైవిధ్యాన్ని తీవ్రంగా పరిగణించలేదు. WHO, CDC రెండూ కరోనా వైరస్ కొత్త ఉప-వేరియంట్ JN.1ని నిరోధించడంలో ప్రస్తుత కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావవంతంగా ఉందని నిర్ధారించాయి. JN.1 రూపాంతరం Omicron కి చెందిన ఉప-వేరియంట్ కాబట్టి.. ఇప్పటికే ఉన్న టీకా ఈ వేరియంట్ ప్రభావాన్ని తగ్గించగలదు.

ఇవి కూడా చదవండి

టీకాలు వేయడం ద్వారా ఆసుపత్రిలో చేరడం, మరణించడం వంటి కేసులను అదుపులో ఉంచవచ్చు, అయితే కోవిడ్ వైరస్‌లో నిరంతర మార్పుల దృష్ట్యా యూనివర్సల్ వ్యాక్సిన్‌పై కూడా పరిశోధన జరుగుతోంది.  భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలు అటువంటి వ్యాక్సిన్‌లను తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఇది అన్ని రకాల వైరస్ పై ప్రభావవంతంగా పని చేసే విధంగా ఉంటుంది.

మరొక మోతాదు తీసుకోవాల్సిన అవసరం ఉందా?

ఢిల్లీలోని రాజీవ్ గాంధీ హాస్పిటల్‌లో కోవిడ్ నోడల్ ఆఫీసర్‌గా ఉన్న డాక్టర్ అజిత్ జైన్, జెఎన్. వేరియంట్ కోసం ప్రస్తుతం మరో డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకోవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే, కొంతమంది రోగులు మాత్రం మరో మోతాదు తీసుకోవాలని సూచించవచ్చు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ,  ICMR నిపుణులు మాత్రమే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ వైవిధ్యం ఉన్న రోగుల్లో  లక్షణాలు ఎలా కనిపిస్తాయో చూడాలని పేర్కొన్నారు. ప్రస్తుతం కేసులు తక్కువగా ఉన్నాయి.. JN.1 వేరియంట్ కేసులు మరిన్ని పెరిగితే తలెత్తితే సమస్యలను బట్టి టీకాపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు.

ప్రస్తుతం ప్రజల్లో రోగనిరోధక శక్తి ఏ స్థాయిలో ఉందో కూడా చూడాలి. కేసులు మాత్రమే పెరిగి, ఆసుపత్రిలో చేరకుండా ఉంటే.. రోగ నిరోధక శక్తి స్థాయి బాగానే ఉందని అర్ధం. ప్రస్తుతం ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని.. అజాగ్రత్తగా ఉండవద్దని సూచించారు.

WHO ఏమి చెప్పిందంటే?

JN.1 వేరియంట్‌ బారిన పడిన రోగులు ప్రస్తుతం ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని WHO చెబుతోంది. ఇప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైన వారిని మాత్రమే ఆసుపత్రిలో చేర్చాల్సి ఉంటుంది. ఈ రూపాంతరం వేరియంట్ లక్షణాలు దగ్గు, జలుబు, తేలికపాటి జ్వరం మాత్రమే. ప్రపంచంలో అందుబాటులో ఉన్న టీకా  ప్రభావవంతంగా ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. నీటిలో కొట్టుకుపోయిన కూరగాయలు
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. నీటిలో కొట్టుకుపోయిన కూరగాయలు
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. అభిమానులకు చిరంజీవి సూచనలు..
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. అభిమానులకు చిరంజీవి సూచనలు..
Video: పాకిస్తాన్ ఫీల్డింగ్ చూస్తే సిగ్గుతో తలదించుకోవాల్సిందే
Video: పాకిస్తాన్ ఫీల్డింగ్ చూస్తే సిగ్గుతో తలదించుకోవాల్సిందే
కేన్సర్‌తో మరణానికి దగ్గరగా యువతి.. జీవితంలోని చివరి క్షణాలు వేలం
కేన్సర్‌తో మరణానికి దగ్గరగా యువతి.. జీవితంలోని చివరి క్షణాలు వేలం
కొత్తిల్లు కడుతున్నారా.? ఈ బేసిక్‌ వాస్తు నియమాలు పాటించండి..
కొత్తిల్లు కడుతున్నారా.? ఈ బేసిక్‌ వాస్తు నియమాలు పాటించండి..
వరంగల్‌ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
వరంగల్‌ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
వర్ష బీభత్సం.. కారులో విమానాశ్రయానికి వస్తూ తండ్రీకూతురు..
వర్ష బీభత్సం.. కారులో విమానాశ్రయానికి వస్తూ తండ్రీకూతురు..
బాలకృష్ణకు అభినందనలు తెలిపిన రజినీకాంత్..
బాలకృష్ణకు అభినందనలు తెలిపిన రజినీకాంత్..
దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్‌‌.. 4 ఓవర్లతో చెత్త రికార్..
దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్‌‌.. 4 ఓవర్లతో చెత్త రికార్..
వాగులో చిక్కుకున్న బస్సు.. 10 గంటలుగా ప్రయాణికుల అవస్థలు
వాగులో చిక్కుకున్న బస్సు.. 10 గంటలుగా ప్రయాణికుల అవస్థలు
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. నీటిలో కొట్టుకుపోయిన కూరగాయలు
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. నీటిలో కొట్టుకుపోయిన కూరగాయలు
కేన్సర్‌తో మరణానికి దగ్గరగా యువతి.. జీవితంలోని చివరి క్షణాలు వేలం
కేన్సర్‌తో మరణానికి దగ్గరగా యువతి.. జీవితంలోని చివరి క్షణాలు వేలం
వరంగల్‌ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
వరంగల్‌ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
వేప చెట్టు నుంచి కారుతున్న పాలు.. ఆ దేవత మహిమేనంటూ మహిళల పూజలు
వేప చెట్టు నుంచి కారుతున్న పాలు.. ఆ దేవత మహిమేనంటూ మహిళల పూజలు
బాబోయ్‌..హైదరాబాద్‌లో 20 అడుగుల భారీ కొండచిలువ కలకలం..
బాబోయ్‌..హైదరాబాద్‌లో 20 అడుగుల భారీ కొండచిలువ కలకలం..
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..