PM Modi: ప్రధాని మోదీ కటౌట్‌కు ముద్దు పెట్టిన కాశ్మీరీ.. ఫెరాన్ దినోత్సవం సందర్భంగా లాల్‌చౌక్‌లో..
జమ్మూ కశ్మీర్‌లో అత్యంత తీవ్రమైన శీతాకాలం 'చిల్లై కలాన్' ప్రారంభమైంది. స్థానిక భాషలో "చిల్లై కలాన్" అని పిలువబడే 40 రోజుల అత్యంత తీవ్రమైన చలికాలం కాశ్మీర్ లోయలో ఈరోజు (డిసెంబర్21) నుంచి ప్రారంభమైంది. చిల్లై-కలాన్ సమయంలో ఈ ప్రాంతంలో వాతావరణం పొడిగా, చల్లగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థానం కంటే తక్కువగా ఉంటాయి. అయితే, చిల్లై కలాన్ మొదటి రోజును "అంతర్జాతీయ ఫెరాన్ దినోత్సవం" గా జరుపుకుంటారు.
జమ్మూ కశ్మీర్‌లో అత్యంత తీవ్రమైన శీతాకాలం ‘చిల్లై కలాన్’ ప్రారంభమైంది. స్థానిక భాషలో “చిల్లై కలాన్” అని పిలువబడే 40 రోజుల అత్యంత తీవ్రమైన చలికాలం కాశ్మీర్ లోయలో ఈరోజు (డిసెంబర్21) నుంచి ప్రారంభమైంది. చిల్లై-కలాన్ సమయంలో ఈ ప్రాంతంలో వాతావరణం పొడిగా, చల్లగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థానం కంటే తక్కువగా ఉంటాయి. అయితే, చిల్లై కలాన్ మొదటి రోజును “అంతర్జాతీయ ఫెరాన్ దినోత్సవం” గా జరుపుకుంటారు. ఫెరాన్ దినోత్సవం సందర్భంగా జమ్మూలో కాశ్మీరీ సాంప్రదాయ ఉట్టిపడేలా రంగురంగుల ఫెరాన్ (ఉన్ని వస్త్రం) ధరించి, లాల్ చౌక్‌లోని ఘంటా ఘర్ దగ్గర పురుషులు, మహిళలు ఫెరాన్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ విగ్రహాన్ని సంప్రదాయ “ఫెరాన్”లో అలంకరించి.. ప్రధాని మోదీపై ఉన్న ప్రేమను స్థానికులు చాటుకున్నారు. లాల్ చౌక్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోర్ట్రెయిట్ కటౌట్ స్థానికులతోపాటు సందర్శకులకు సైతం ప్రధాన ఆకర్షణగా మారింది. ప్రధానమంత్రి చిత్రపటం వద్ద సందర్శకులు ఫొటోలు దిగుతూ సందడిచేశారు. అయితే, ఈ సందర్భంగా ఓ వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి ముద్దు పెడుతూ తన ప్రేమను చాటుకున్నాడు. ఆప్యాయతతో కౌగిలించుకుని కృతజ్ఞతలు తెలిపాడు.
అంతర్జాతీయ ఫెరాన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాశ్మీర్ లోయలోని బిజీ క్యాపిటల్ బిజినెస్ హబ్ సెంటర్‌లో ప్రజల దృష్టిని ఆకర్షించడానికి సాంప్రదాయిక రంగురంగుల ఫెరాన్ ధరించి, పురుషులు, మహిళలు, పిల్లలు చారిత్రక లాల్ చౌక్ (ఘంటా ఘర్ లేదా క్లాక్ టవర్) దగ్గర సందడి చేశారు. “ఫెరాన్”, చలిని తట్టుకోవడానికి ధరించే పొడవైన వస్త్రం.. “ఫెరాన్” కాశ్మీరీ సంస్కృతి, చారిత్రాత్మకతను ప్రతిబింబిస్తుంది. ప్రజలు డిజైన్‌ను మార్చడంలో తప్ప ఇప్పటివరకు దుస్తులలో ఎటువంటి తీవ్రమైన మార్పులు చేయలేదు. “చిలై కలాన్” తర్వాత 20 రోజుల పాటు ఉండే “చిల్లై ఖుర్ద్” ఆ తర్వాత 10 రోజుల “చల్లియా బచా” తో ఫిబ్రవరిలో తీవ్రమైన శీతాకాలం ముగుస్తుంది.
వీడియో చూడండి..
Kashmiri Man Kisses A Statue of PM Modi infront of Ghantaghar | Pheran day .@narendramodi @BJP4India @BJP4JnK @RavinderRaina @AmitShah @PMOIndia @HMOIndia @TheSkandar @manojsinha_ @DrSJaishankar @ianuragthakur @Swamy39 @BJP4Gujarat @BJP4Delhi pic.twitter.com/hevT7F3Sx1
— Sheikh_imran_official (@Sheikhimran_) December 21, 2023
అయితే, జమ్మూకశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 ని 2019లో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఉగ్రవాదులను అరికట్టేందుకు ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు సైతం తీసుకున్నారు. కాశ్మీరి పండిట్ల కోసం కూడా ప్రత్యేక చట్టాలను అమలు చేశారు. దీంతో అక్కడ ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఫెరాన్ డే సందర్భంగా ఓ వ్యక్తి ఇలా తన ప్రేమను చాటుకున్నాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..