Indian Navy INCET 2024: నౌకాదళంలో 910 ఉద్యోగాలకు ఐఎన్‌సెట్ నోటిఫికేషన్ విడుదల
భారత నౌకాదళంలో 910 గ్రూప్ బీ, సీ సివిల్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుషులు, మహిళలు, దివ్యాంగ అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఐఎన్‌సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల చేసింది. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ విద్యార్హతల కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్టు (ఐఎన్‌సెట్)తో ఈ పోస్టులు భర్తీ చేస్తారు. ఎంపికైన వారిని చార్జ్‌మెన్, సీనియర్ డ్రాఫ్ట్స్‌మెన్, ట్రేడ్స్‌మెన్ మేట్ హోదాతో దేశంలో..
భారత నౌకాదళంలో 910 గ్రూప్ బీ, సీ సివిల్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుషులు, మహిళలు, దివ్యాంగ అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఐఎన్‌సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల చేసింది. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ విద్యార్హతల కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్టు (ఐఎన్‌సెట్)తో ఈ పోస్టులు భర్తీ చేస్తారు. ఎంపికైన వారిని చార్జ్‌మెన్, సీనియర్ డ్రాఫ్ట్స్‌మెన్, ట్రేడ్స్‌మెన్ మేట్ హోదాతో దేశంలో ఉన్న నేవీ కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తారు. ఈ పోస్టులకు ఎలాంటి దేహదార్ఢ్య పరీక్షలూ ఉండవు. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. సాధారణ వైద్య పరీక్షలతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. అభ్యర్ధుల వయసు ఛార్జ్‌మెన్, ట్రేడ్స్‌మెన్ మేట్ పోస్టులకు డిసెంబరు 31, 2023 నాటికి 18 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. సీనియర్ డ్రాఫ్ట్స్‌మెన్ ఖాళీలకు 27 ఏళ్ల వరకు అవకాశం. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు..
- గ్రూప్ బీలో 22 ఛార్జ్‌మెన్ వర్క్‌షాప్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు బీఎస్సీ మ్యాథ్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ వీటిలో ఏదైనా సబ్జెక్టు చదివుండాలి లేదా కెమికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమాలో అర్హత సాధించి ఉండాలి.
- ఛార్జ్‌మెన్ ఫ్యాక్టరీ పోస్టులు 20 వరకు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే బీఎస్సీ మ్యాథ్స్/ ఫిజిక్స్/ కెమిస్ట్రీ వీటిలో ఏదైనా సబ్జెక్టు చదివుండాలి లేదా ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/ కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసి ఉండాలి.
- సీనియర్ డ్రాఫ్ట్స్‌మెన్ విభాగంలో ఎలక్ట్రికల్ పోస్టులు 142, మెకానికల్ పోస్టులు 26, కన్‌స్ట్రక్షన్ పోస్టులు 29, కార్టోగ్రాఫిక్ పోస్టులు 11, ఆర్మమెంట్ పోస్టులు 50 వరకు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే పదో తరగతి ఉత్తీర్ణత అనంతరం రెండేళ్ల డిప్లొమా లేదా డ్రాఫ్ట్‌మెన్‌షిప్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. అలాగే ఎలక్ట్రికల్/ మెకానికల్/ నేవల్ ఆర్కిటెక్చర్/ కార్ట్టోగ్రఫీ వీటిలో దేనిలోనైనా మూడేళ్లు డ్రాయింగ్/ డిజైన్ అనుభవం తప్పనిసరి.
- గ్రూప్ సీలో.. డ్రాఫ్ట్స్‌మెన్ మేట్ పోస్టులు 610 ఉన్నాయి. వీటిల్లో ఈస్టర్న్ నేవల్ కమాండ్ పోస్టులు 9, వెస్ట్రన్ నేవల్ కమాండ్ పోస్టులు 565, సదరన్ నేవల్ కమాండ్ పోస్టులు 36 వరకు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు నిర్దేశిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. నోటిఫికేషన్‌లో పేర్కొన్న 64 ఐటీఐ ట్రేడుల్లో ఏదైనా పూర్తి చేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం
పరీక్షను వంద మార్కులకు ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం వంద ప్రశ్నలకు వంద మార్కులు ఉంటాయి. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ 25, జనరల్ అవేర్‌నెస్ 25, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 విభాగాల నుంచి ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో మాత్రమే ఉంటుంది. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు ఉంటుంది. పరీక్షలో ఉత్తీర్ణత పొందితే వైద్య పరీక్షలు నిర్వహించి, ఉద్యోగంలోకి తీసుకుంటారు.
ఎంపికైనవారికి గ్రూప్ బీ పోస్టులకేతే నెలకు రూ.35,400 నుంచి రూ.55,000 వరకు జీతంగా చెల్లిస్తారు. గ్రూప్ సీలోపోస్టులకు నెలకు రూ.18,000 నుంచి రూ.30 వేల వరకు జీతం చెల్లిస్తారు.ఆన్‌లైన్ విధారంలొ దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబరు 31, 2023వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు ఫీజు చెల్లించనవసరం లేదు. మిగిలినవారు రూ.295 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.