India Corona: దేశంలో 206 రోజుల తర్వాత భారీగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?

India Covid-19 Updates: దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ పెరిగిన కేసులు ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో

India Corona: దేశంలో 206 రోజుల తర్వాత భారీగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?
India Corona
Follow us

|

Updated on: Oct 05, 2021 | 9:43 AM

India Covid-19 Updates: దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ పెరిగిన కేసులు ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి కేసుల సంఖ్య మళ్లీ తగ్గుముఖం పడుతూ వస్తోంది. సోమవారం కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా18,346 కేసులు నమోదయ్యాయి. 209 రోజుల తర్వాత కేసుల సంఖ్య 18వేలకు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న నమోదైన కేసులతో.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,38,53,048 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 97.93 శాతానికి పెరిగిందని వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 2,52,902 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 263 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి మరణాల సంఖ్య 4,49,260 కి పెరిగింది. అయితే.. నిన్న కరోనా నుంచి 29,639 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,31,50,886 కి పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. కేరళలో కరోనా విజృంభిస్తోంది. నిన్న నమోదైన కేసుల్లో కేరళలో 8,850 కేసులు నమోదు కాగా.. 149 మంది మరణించారు.

ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా 11,41,642 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో ఇప్పటివరకు 57,53,94,042 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.

Also Read:

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడితే.. రూ.5 వేల బహుమతి..

Vehicle Horn: కొత్త నిబంధనలు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై వాహనాల హారన్‌లో సంగీతం..!

లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??