Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vehicle Horn: కొత్త నిబంధనలు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై వాహనాల హారన్‌లో సంగీతం..!

Vehicle Horn:  వాహనాల ట్రాఫిక్ రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్‌ పెరిగిపోతోంది. ట్రాఫిక్‌లో..

Vehicle Horn: కొత్త నిబంధనలు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై వాహనాల హారన్‌లో సంగీతం..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 05, 2021 | 9:12 AM

Vehicle Horn:  వాహనాల ట్రాఫిక్ రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్‌ పెరిగిపోతోంది. ట్రాఫిక్‌లో వాహనదారులు తెగ హరన్‌ కొడుతుంటారు. ఫలితంగా విపరీతమైన ధ్వని కాలుష్యం. రోడ్డు మీద ఉన్నవారికే కాకుండా చుట్టు పక్కల ఇళ్లల్లో ఉండే వారికి కూడా ఈ సౌండ్​ పొల్యూషన్​ చికాకు తెప్పిస్తుంది. హారన్​ కొట్టిన కారణంగా ట్రాఫిక్​ సిగ్నల్స్​ దగ్గర గొడవలైన సందర్బాలు కూడా చాలానే ఉన్నాయి.

శబ్ద కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలకు అంతుచిక్కని వ్యాధులు వస్తున్నాయి. చెవుడుతోపాటు మానసిక ఆందోళన, ఒత్తిళ్లు, గుండె సంబంధింత వ్యాధులు తలెత్తుతున్నాయి. అయితే ఎమర్జెన్సీ సమయంలో ఏర్పాటు చేసిన ఈ హారన్ ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో అనేక అనర్దాలు జరుగుతున్నాయి. ఇటువంటి అనర్దాలను దూరం చేసేందుకు కేంద్ర రోడ్దు రవాణా శాఖ నూతన హారన్ విధానానికి శ్రీకారం చుట్టబోతోంది. వాహనాల హారన్ల శబ్దానికి సంబంధించి కొత్త నిబంధనలను అమలు కేంద్ర సర్కార్‌ రెడీ అవుతోంది. ఇక నుంచి హారన్‌లో సంగీతం శబ్దం వినిపించబోతోంది.

హారన్ లో సంగీత: మంత్రి నితిన్​ గడ్కరీ

ఇప్పుడు తాజాగా హార్న్ వాయిస్ చికాకు పెట్టకుండా మంచి ఆహ్లాదకరంగా ఉండేలా కొత్త ప్లాన్‌ వేస్తోంది. నాసిక్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్​ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధ్వని కాలుష్యంపై మాట్లాడారు. వాహనాల హారన్‌లను మార్చబోతున్నట్లు వెల్లడించారు. అంబులెన్సు హారన్ కూడా వినడానికి అంతగా బాగోదని ఆయన అభిప్రాయపడ్డారు. ఉదయం ఆకాశవాణిలో వచ్చే సంగీత వాయిద్యం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని నితిన్​ గడ్కరీ పేర్కొన్నారు. అలాంటి ధ్వని హారన్​లో ఉంటే బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

త్వరలో మీరు వాహనాల హార్న్ శబ్దం నుంచి బయటపడతారని ఆయన వెల్లడించారు. వాహనాల హారన్ల బాధాకరమైన శబ్దం గురించి.. కేంద్ర మంత్రి తన మంత్రిత్వ శాఖ అధికారులు కార్ హారన్​ల శబ్దాన్ని మార్చే పనిలో ఉన్నట్లుగా చెప్పారు. తబలా, తాల్, వయోలిన్, బుగ్లే, ఫ్లూట్ వంటి వాయిద్యాల శబ్దం హారన్​ నుంచి వినిపించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అలాగే భారీ వాహనాలకు భారీ శబ్ధం వచ్చేలా ప్లాన్ అనుమతి ఉంటుందని కేంద్ర మంత్రి చెప్పారు. వాహనం తయారవుతున్నప్పుడు వారికి సరైన రకం హార్న్ ఉంటుంది. కొత్త నిబంధనల అమలు తర్వాత వాహనాల హారన్‌లకు బదులుగా తబలా, లయ, వయోలిన్, బుగ్లే, వేణు మొదలైన ట్యూన్‌లు వినవచ్చు అని అన్నారు. రోడ్ల మీద వెళ్లే వాహనాల విషయంలోనే కాదు.. షిప్స్‌, రైళ్ల విషయంలోనూ ఈ నిబంధనలు పాటించాలి. సాధారణంగా రైళ్ల హారన్‌ 130-150 డెసిబెల్స్‌ దాకా ఉంటుంది. దూరం ఉన్నప్పుడు మాత్రమే ఈ శబ్ద తీవ్రతతో హారన్‌ కొట్టాలి. ప్లాట్‌ఫామ్‌ మీదకు వచ్చిన తర్వాత కూడా ఈ రేంజ్‌ సౌండ్‌ హారన్‌ కొట్టడం రూల్స్‌కి వ్యతిరేకం.

ఇవీ కూడా చదవండి:

Jackfruit Benefits: పనస పండు వల్ల అదిరిపోయే బెనిఫిట్స్‌.. ఆ విషయంలో మాత్రం కీలక పాత్ర..!

WHO Top Scientist: 75 ఏళ్లలో భారత ప్రపంచంలో నెంబర్ 1 ఫార్మాగా ఖ్యాతి.. కరోనాని ఎదుర్కొన్న తీరుపై సైంటిస్ట్ సౌమ్య ప్రశంసలు