కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడితే.. రూ.5 వేల బహుమతి..

Central Government: దేశంలో నిత్యం వందలాది రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో చాలామంది మరణిస్తున్నారు. మరికొంతమంది అవిటివారై బతుకీడుతుస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడితే.. రూ.5 వేల బహుమతి..
Road Accident

Central Government: దేశంలో నిత్యం వందలాది రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో చాలామంది మరణిస్తున్నారు. మరికొంతమంది అవిటివారై బతుకీడుతుస్తున్నారు. అయితే.. సరైన సమయంలో చికిత్స అందకపోవడం వల్ల చాలామంది వికలాంగులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలను కాపాడే వారికి ప్రోత్సహం అందించేందుకు సరికొత్త పథకంతో ముందుకొచ్చింది. ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే.. క్షతగాత్రులను మొదటి గంటలోగా (గోల్డెన్‌ అవర్‌) ఆసుపత్రికి తరలించిన వారికి రూ.5 వేల ప్రోత్సాహక బహుమతి అందించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం 2021 అక్టోబర్‌ 15 నుంచి 2026 మార్చి 31 వరకు కొనసాగుతుందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల రవాణా శాఖల కార్యదర్శులకు కేంద్ర ప్రభుత్వం సమాచారం పంపింది.

రూ. 5 వేల ప్రోత్సాహకంతో పాటు ప్రశంస సర్టిఫికెట్‌ను కూడా అందించనున్నట్లు కేంద్రం తెలిపింది. అత్యంత విలువైన సాయం అందించిన వారి నుంచి కొంత మందిని ఎంపిక చేసి ఏడాదికోసారి జాతీయ స్థాయి అవార్డులను ప్రకటించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. అత్యంత విలువైన సాయం చేసిన వారికి రూ. లక్ష చొప్పున బహుమతి ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఒకరి కంటే ఎక్కువ మంది బాధితులను, ఒకరి కంటే ఎక్కువ మందిని కాపాడితే ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఈ పథకం ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Also Read:

Sidhu Arrested: గవర్నర్ హౌస్‌ను ముట్టడించిన కాంగ్రెస్.. నవజ్యోత్ సింగ్ సిద్ధును అదుపులోకి తీసుకున్న పోలీసులు..

Shri Ramayana Yatra: రామ భక్తులకు బిగ్‌ న్యూస్‌.. 7న ప్రారంభం కానున్న శ్రీ రామాయణ రైలు యాత్ర..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu