కరోనా సమయంలో దేశ ప్రజలకు గుడ్ న్యూస్.. లక్షకు దిగువన నమోదైన పాజిటివ్ కేసులు.. కొత్తగా ఎన్నంటే.!
దేశంలో విజృంభించిన కరోనా సెకండ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య తగ్గుతుండటం ప్రజలకు..
దేశంలో విజృంభించిన కరోనా సెకండ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య తగ్గుతుండటం ప్రజలకు ఊరటను ఇస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 86,498 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 63 రోజుల్లో ఇంత తక్కువ పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక గత నెల ఇదే రోజున దేశవ్యాప్తంగా 4,14,188 పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.
నిన్న 2123 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. ఇక కరోనా నుంచి కోలుకుని కొత్తగా 1,82,282 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు13,03,702 కాగా.. ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,73,41,462కి చేరింది. అటు ఇప్పటివరకు దేశంలో 23,61,98,726 మందికి వ్యాక్సినేషన్ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. కాగా, కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపధ్యంలో రాష్ట్రాలు దశల వారీగా అన్‌లాక్ ప్రక్రియను మొదలుపెట్టాయి.
Also Read:
ప్రతీ నెలా రూ. 3810 డిపాజిట్ చేస్తే.. మీ కూతురు కోసం రూ. 27 లక్షలు పొందొచ్చు.. పూర్తి వివరాలు..
టీమిండియా చరిత్రలో చెత్త మ్యాచ్.. జీరోకి నాలుగు వికెట్లు.. ఆ ఇంగ్లీష్ బౌలర్ ఎవరంటే.?