AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona: క్రమంగా పెరుగుతున్న కరోనా.. ఇవాళ కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే

దేశంలో కరోనా(Corona) కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నా అవి స్వల్పంగానే ఉంటున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో కరోనా విజృంభణతో...

Corona: క్రమంగా పెరుగుతున్న కరోనా.. ఇవాళ కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
Corona
Ganesh Mudavath
|

Updated on: May 11, 2022 | 11:26 AM

Share

దేశంలో కరోనా(Corona) కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నా అవి స్వల్పంగానే ఉంటున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో కరోనా విజృంభణతో పరీక్షల సంఖ్యనూ పెంచారు. తాజాగా 4.72 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,897 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. వైరస్ కారణంగా 54 మంది మృతి చెందారు. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా 4.31 కోట్ల మందికి కరోనా సోకగా 5.24 లక్షల మందికి పైగా కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 2,986 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. తాజాగా యాక్టీవ్ కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం దేశంలో ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య 19,494కి పెరిగింది. రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. నిన్న 14.8 లక్షల మంది టీకా తీసుకోగా మొత్తంగా 190 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది.

మరోవైపు.. కోవిడ్ పలు వేరియంట్ల రూపంలో పంజా విసురుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. మహమ్మారి బారిన పడి కోలుకున్న వారు చాలా కాలంపాటు పలు దీర్ఘ కాలిక ప్రభావాలను ఎదుర్కొంటున్నారని, ప్రస్తుతం ఈ విషయం ఆందోళన కలిగిస్తోందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం దాదాపు 10-20 శాతం మంది ప్రజలు కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత.. వివిధ రకాల దీర్ఘకాలిక ప్రభావాలను అనుభవిస్తున్నరని అధ్యయనంలో వెల్లడించింది. అయితే అమెరికా తర్వాత భారతదేశంలో అత్యధిక సంఖ్యలో COVID-19 కేసులు నమోదైన నేపథ్యంలో ఇది ఆందోళన కలిగించే విషయమని భారత వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

SSC CHSL Final Results 2019: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్‌ 2019 తుది ఫలితాలు విడుదల

మంచుప్రదేశంలో హాయిగా ఉయ్యాల ఊగుతున్న కోడిపెట్ట !! సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల హర్షం