Vodafone Idea: మళ్లీ పుంజుకుంటున్న వోడాఫోన్ ఐడియా.. నష్టాలను తగ్గించుకుని..
Vodafone Idea: టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా నిన్న మార్చితో ముగిసిన నాల్గవ క్వార్టర్ ఫలితాలు విడుదల చేసింది. ఈ సారి కంపెనీ తన నష్టాలను తగ్గించుకుంది.
Vodafone Idea: టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా నిన్న మార్చితో ముగిసిన నాల్గవ క్వార్టర్ ఫలితాలు విడుదల చేసింది. ఈ సారి కంపెనీ తన నష్టాలను తగ్గించుకుంది. ఈ కాలంలో కంపెనీ ఏకీకృత నష్టాలు రూ. 6,563.1 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది. మునుపటి సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే.. వినియోగదారుల నుంచి ARPU వసూళ్లను రియలైజేషన్ సీక్వెన్షియల్ ప్రాతిపదికన బాగా మెరుగుపడింది. గత ఏడాది ఇదే కాలంలో నష్టాలు రూ.7,022.8 కోట్లుగా ఉన్నాయని కంపెనీ ఫైలింగ్‌లో పేర్కొంది. 2022 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం సంవత్సరానికి 6.6 శాతం పెరిగి రూ.10,239.5 కోట్లకు చేరుకుంది. క్రమానుగతంగా చూస్తే ఆదాయం 5.4 శాతం పెరిగింది. గత సంవత్సరం నవంబర్ లో ఛార్జీల పెంపు దీనికి ఎంతగానో తోర్పడిందని కంపెనీ వెల్లడించింది.
యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ARPU) పరంగా యావరేజ్ రెవెన్యూ రూ. 124గా ఉంది. అంతకు ముందు త్రైమాసికంలో ఈ ఆదాయం రూ. 115గా ఉన్నట్లు వెల్లడించింది. దీని ఫలితంగా ఒక్కో వినియోగదారునికి సగటు ఆదాయం (ARPU)లో 7.5 శాతం క్రమంగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 44,233.1 కోట్లుగా ఉన్న నష్టాలు.. FY22 పూర్తి సంవత్సరానికి రూ.28,245.4 కోట్లకు తగ్గాయి.
మార్చి 2022తో ముగిసిన సంవత్సరానికి కార్యకలాపాల ద్వారా కంపెనీకి రూ. 38,515.5 కోట్ల ఆదాయం వచ్చింది. వోడాఫోన్ ఐడియా MD, CEO రవీందర్ టక్కర్ మాట్లాడుతూ.. నవంబర్ 2021లో తీసుకున్న టారిఫ్ నిర్ణయాల ద్వారా ఆదాయ వృద్ధిలో వరుసగా మూడవ త్రైమాసికం ప్రకటించటం సంతోషంగా ఉన్నట్లు వెళ్లడించారు. ప్రమోటర్ల నుంచి రూ. 45 బిలియన్ల ప్రిఫరెన్షియల్ ఈక్విటీ ఇష్యూ ద్వారా మెుదట విడత నిధుల సేకరణను విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు వెల్లడించారు. తదుపరి నిధుల సమీకరణ కోసం కంపెనీ రుణదాతలు, ఇన్వెస్టర్లతో చర్చలు చేస్తోందని తెలిపారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
Stock Market: స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ఫోకస్ లో ఆ కంపెనీల షేర్లు..
Elon Musk: చైనాలో ఎలాన్ మస్క్ కు భారీ షాక్.. వరుస సమస్యలతో ప్రపంచ కుబేరుడు ఉక్కిరిబిక్కిరి..