SBI FD Rates: SBI కస్టమర్లకు గుడ్ న్యూస్.. FD వడ్డీ రేట్లను పెంచిన ప్రభుత్వరంగ బ్యాంక్..
SBI FD Rates: దేశీయ ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. వడ్డీ రేట్ల విషయంలో బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది.
SBI FD Rates: దేశీయ ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. బల్క్ టర్మ్ డిపాజిట్స్ పైన వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్ల నుంచి 90 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. సవరించిన వడ్డీ రేట్లు రూ.2 కోట్లు ఆపైన ఉండే FDలకు వర్తిస్తాయని వెల్లడించింది. ఈ పెంపు మే 10 నుంచి అమలులోకి వచ్చినట్లు ఎస్బీఐ తెలిపింది. ఏడు రోజుల నుంచి 45 రోజుల కాలపరిమితిపై FD వడ్డీ రేటు 3 శాతంగా కొనసాగిస్తున్నారు. 46 రోజుల నుంచి 179 రోజుల కాలపరిమితిపై 3 శాతం నుంచి 3.50 శాతానికి, 180 రోజుల నుంచి 210 రోజుల కాలపరిమితిపై 40 బేసిస్ పాయింట్లు పెంచి 3.50 శాతానికి సవరించింది. 211 రోజుల నుండి ఏడాది లోపు కాలపరిమితిపై 3.3 శాతం ఉండగా, 45 బేసిస్ పాయింట్లు పెంచి 3.75 శాతానికి చేర్చింది.
సీనియర్ సిటిజన్లకు..
సీనియర్ సిటిజన్ ఫిక్స్డ్ డిపాజిట్స్‌పైన వడ్డీరేట్లని పెంచుతున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. 7 రోజుల నుంచి 45 రోజుల కాలపరిమితిని మినహాయించింది. 46 రోజుల నుంచి 179 రోజుల కాలపరిమితిపై 3.5 శాతం నుంచి 4 శాతానికి, 180 రోజుల నుంచి 210 రోజుల కాలపరిమితిపై 3.6 శాతం నుంచి 4 శాతానికి పెంచింది. 211 రోజుల నుంచి ఏడాది లోపు కాలపరిమితిపై 3.80 శాతం నుంచి 4.25 శాతానికి, ఏడాది నుండి రెండేళ్ల కాలపరిమితిపై 4.1 శాతం నుంచి 4.5 శాతానికి, రెండేళ్ల నుంచి మూడేళ్ల కాలపరిమితిపై 4.1 శాతం నుంచి 4.75 శాతానికి, మూడేళ్ల నుండి అయిదేళ్ల కాలపరిమితిపై 4.1 శాతం నుంచి 5 శాతానికి, అయిదేళ్ల నుంచి పదేళ్ల కాలపరిమితిపై 4.1 శాతం నుంచి 5 శాతానికి పెంచింది.
ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా మంగళవారం లోన్ వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచింది. ఈ నెల 12 నుంచి ఎంసీఎల్ఆర్ ఆధారిత వడ్డీ రేటును 0.1 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. రూ.100 కోట్లకు మించిన సేవింగ్స్ డిపాజిట్స్ పైన వడ్డీ రేటును జూన్ 1 నుంచి.. 20 నుంచి 65 బేసిస్ పాయింట్ల మేర పెంచనున్నట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. రూ.50 లక్షల నుంచి రూ.100 కోట్ల వరకు డిపాజిట్స్ పైన వడ్డీ రేటును 2.9 శాతం వద్ద కొనసాగిస్తోంది. రూ.100 నుంచి రూ.500 కోట్ల డిపాజిట్స్ పైన 2.90 శాతం నుంచి 3.10 శాతానికి రూ.500 నుంచి రూ.1000 కోట్ల డిపాజిట్స్ పైన 2.90 శాతం నుంచి 3.40 శాతానికి, రూ.1000 కోట్లకు పైన డిపాజిట్ల పైన 2.90 శాతం నుంచి 3.55 శాతానికి పెంచింది. రూ.50 లక్షల కంటే తక్కువ సేవింగ్స్ డిపాజిట్స్ వడ్డీ రేట్లను 15 బేసిస్ పాయింట్లు తగ్గించి 2.75 శాతానికి పరిమితం చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
Andhra Pradesh: మరి కొన్ని గంటల్లో పెళ్లి.. సీన్ కట్ చేస్తే.. వరుడు చేసిన పనికి అందరూ షాక్..!
Stock Market: స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ఫోకస్ లో ఆ కంపెనీల షేర్లు..