AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: మరి కొన్ని గంటల్లో పెళ్లి.. సీన్ కట్ చేస్తే.. వరుడు చేసిన పనికి అందరూ షాక్..!

Andhra Pradesh: ఇల్లంతా పెళ్లి సందడి.. పచ్చని తోరణాలతో కళకళ లాడుతోంది. బంధుమిత్రులంతా వస్తున్నారు. కొద్ది గంటల్లో ముహూర్తం.. ఉదయం లేచి రెడీ అయ్యేందుకు అంతా సిద్దం చేసుకున్నారు. ఇంతలో అందరికీ షాక్..!

Andhra Pradesh: మరి కొన్ని గంటల్లో పెళ్లి.. సీన్ కట్ చేస్తే.. వరుడు చేసిన పనికి అందరూ షాక్..!
Wedding
Ayyappa Mamidi
| Edited By: Shaik Madar Saheb|

Updated on: May 11, 2022 | 2:03 PM

Share

Andhra Pradesh: ఇల్లంతా పెళ్లి సందడి.. పచ్చని తోరణాలతో కళకళ లాడుతోంది. బంధుమిత్రులంతా వస్తున్నారు. కొద్ది గంటల్లో ముహూర్తం.. ఉదయం లేచి రెడీ అయ్యేందుకు అంతా సిద్దం చేసుకున్నారు. ఇంతలో అందరికీ షాక్..! వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విశాఖలోని మల్కాపురం జయేంద్రకాలనీలో చోటుచేసుకుంది. హెచ్పీసీఎల్(HPCL) లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న పి. దినేష్ కు తల్లిదండ్రులు వివాహ సంబంధం చూశారు. ఒక్కగానోక్కకొడుకు పెళ్లి ఘనంగా చేయాలనుకున్నారు. పెందుర్తి పెదగాడి ప్రాంతానికి చెందిన యువతితో పెళ్లి కుదిరిచ్చారు. ఎంగేజ్ మెంట్ కూడా ఘనంగా చేశారు. ఈ రోజు రాత్రి పదిన్నరకు ముహూర్తం పెట్టుకున్నారు.

ఇందుకోసం మల్కాపురం జయేంద్ర కాలనీలో ఉన్న ఇంటిని అందంగా అలంకరించారు. బంధుమిత్రులతో ఇల్లు కళకళలాడుతోంది. మంగళవారం రాత్రి రెండు గంటల వరకు అంతా పెళ్లి బిజీలో ఉన్నారు. మరుసటి రోజు పెళ్లి కావడంతో ఎక్కువసేపు అందరూ మెలకువగానే ఉన్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరూ పడుకున్నారు. ఇంతలో గదిలోకి వెళ్లిన పెళ్లి కొడుకు దినేష్.. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు. సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. వరుడు ఆత్మహత్యతో వధువు కుటుంబ సభ్యులు షాక్ లోకి వెళ్లిపోయారు. పెళ్లి చేసుకోవడం ఇష్టంలేకే ఆత్మహత్యకు పాల్పడ్డాడని  స్థానికులు అంటున్నారు. ముందురోజు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దినేష్ ను తీసుకొచచ్చినట్టు వారు చెబుతున్నారు.

అయితే.. సమస్య ఏంటో తమకు కూడా తెలియదని తండ్రి వెంకటేశ్వరారావు అంటున్నారు. రాత్రి 2గంటల వరకు అంతా మెలకువగానే ఉన్నామని.. మూడు గంటలకు పడుకున్నట్లు వెల్లడించారు. ఆ తరువాత దినేష్ గదిలో ఉరి వేసుకున్నాడని కన్నీటి పర్యంతమయ్యారు. పెళ్లి కుదిరిన సమయంలో కూడా దినేష్ సంతోషంగానే ఉన్నాడని తెలిపారు. పెళ్లి ఇష్టం లేదని గానీ, పెళ్లి చేసుకోనని కానీ ఎప్పుడూ అనలేదని అంటున్నారు. జీతం తక్కువనే టెన్షన్ లో ఉండేవాడని.. పెళ్లి చేసుకుంటే ఆర్ధిక ఇబ్బందులు పెరుగుతాయానే ఆందోళన ఉండేవాడని సమీప బంధువులు అంటున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఖాజా హుస్సేన్(టీవీ-9 విశాఖ రిపోర్టర్)

ఇవీ చదవండి..

Train Ticket Rules: రైల్వే ప్రయాణీకులకు ముఖ్య అలెర్ట్.. ఇకపై టికెట్ బుక్ చేయాలంటే అవి తప్పనిసరి..

Air Cooler: ఎండ‌లు మండుతున్నాయ‌ని కూల‌ర్ కొంటున్నారా ?? జాగ్రత్త..