Asani Cyclone: “అసని” తుపాను ప్రభావిత కుటుంబాలకు పరిహారం.. సీఎం జగన్ కీలక ప్రకటన

అసని తుపాను ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ను చిగురుటాకులా వణికిస్తోంది. తీరంలో ఎగసిపడుతున్న అలలు, ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నివాసముండే వారిని ఆదుకునేందుకు ఏపీ సర్కార్ పునరావాస...

Asani Cyclone: అసని తుపాను ప్రభావిత కుటుంబాలకు పరిహారం.. సీఎం జగన్ కీలక ప్రకటన
Ys Jagan Mohan Reddy
Follow us
Ganesh Mudavath

| Edited By: Anil kumar poka

Updated on: May 11, 2022 | 4:36 PM

అసని తుపాను ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ను చిగురుటాకులా వణికిస్తోంది. తీరంలో ఎగసిపడుతున్న అలలు, ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నివాసముండే వారిని ఆదుకునేందుకు ఏపీ సర్కార్ పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసింది. ఇక్కడే మరో అడుగు ముందుకేసిన జగన్ ప్రభుత్వం పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. అసని(Asani) తుపాను ప్రభావంపై సంబంధిత శాఖ అధికారులు, ఎస్పీలు, కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తుపాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశమన్న సీఎం.. తుపాను ప్రభావిత కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌(CM Jagan) సమీక్ష నిర్వహించారు. తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిర్లక్ష్యానికి అవకాశముండకుండా అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన చోట సహాయ, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అన్నారు. అంతే కాకుండా సహాయ శిబిరాలకు తరలించిన వ్యక్తికి రూ.1000, కుటుంబానికి రూ.2వేలు చొప్పున ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను బలహీనపడింది. మచిలీపట్నానికి ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమైంది. నర్సాపురం తీరానికి దిగువన అల్లవరానికి సమీపంలో భూభాగంపైకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు ఐఎండీ అంచనా వేసింది. ప్రస్తుతం గంటకు 6కి.మీ.వేగంతో కదులుతున్నట్టు తెలిపింది. భూభాగంపైకి వచ్చిన అనంతరం సాయంత్రంలోగా యానాం వద్ద తిరిగి సముద్రంలోకి తుపాను ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. కోస్తాంధ్ర తీరానికి తుపాను అతి దగ్గరగా రావటంతో గాలుల తీవ్రత తగ్గింది. తుపాను పరిసర ప్రాంతాల్లో గంటకు 75 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. అయినప్పటికీ రెడ్ అలర్ట్ కొనసాగుతూనే ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీచదవండి

6 బంతుల్లో 6 సిక్సర్లు.. బౌలర్లపై వీరవిహారం.. కట్ చేస్తే గంజాయి తాగుతూ అడ్డంగా బుక్కయ్యాడు..

Watch Video: అసని తుఫాన్ అల్లకల్లోలం.. ఏపీ తీరానికి కొట్టుకొచ్చిన స్వర్ణ రథం.. వీడియో