Watch Video: అసని తుఫాన్ అల్లకల్లోలం.. ఏపీ తీరానికి కొట్టుకొచ్చిన స్వర్ణ రథం.. వీడియో

అస‌ని తుఫాన్‌తో ఏపీ తీరం వెంట స‌ముద్రం ఉప్పొంగుతోంది. ఈ క్రమంలో ఆ తుఫాన్ ధాటికి కోస్తాంధ్రాలోని శ్రీకాకుళం (Srikakulam) తీరానికి ఓ ర‌థం కొట్టుకువచ్చింది.

Watch Video: అసని తుఫాన్ అల్లకల్లోలం.. ఏపీ తీరానికి కొట్టుకొచ్చిన స్వర్ణ రథం.. వీడియో
Sunnapalli Sea Harbour
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 11, 2022 | 1:03 PM

Mysterious, Gold-coloured Chariot: బంగాళాఖాతంలో అసని తుఫాన్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ తుఫాన్ ప్రభావంతో ఏపీ తీర ప్రాంతంలో భారీ ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ తీర ప్రాంతంలోనే అసని తుఫాన్ (Cyclone Asani) తీరాన్ని తాకుతుందన్న వాతావరణశాఖ అంచనాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతోపాటు కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి అధికారులను మోహరించింది. కాగా.. అస‌ని తుఫాన్‌తో ఏపీ తీరం వెంట స‌ముద్రం ఉప్పొంగుతోంది. ఈ క్రమంలో ఆ తుఫాన్ ధాటికి కోస్తాంధ్రాలోని శ్రీకాకుళం (Srikakulam) తీరానికి ఓ ర‌థం కొట్టుకువచ్చింది. సంతబొమ్మాళి సున్నాపల్లి రేవు మంగళవారం బంగారు వర్ణం కలిగిన రధం కొట్టుకువ‌చ్చింది. సంతబొమ్మాళి మండలం ఎం సున్నాపల్లి (Sunnapalli Sea Harbour) సముద్ర రేవుకు వింతైన రధం కొట్టుకురావడంతో ఆ ర‌థాన్ని వీక్షించేందుకు ప్రజలు ఎగ‌బ‌డుతున్నారు. బహుశా ఆ ర‌థం మ‌రో దేశం నుంచి వ‌చ్చి ఉంటుంద‌ని నౌపాడా పోలీసులు, అధికారులు తెలిపారు. ఇంటెలిజెన్స్ అధికారుల‌కు ఈ విష‌యాన్ని చెప్పామ‌ని.. దీన్ని వారు పరిశీలిస్తున్నట్లు ఆయ‌న తెలిపారు.

స‌ముద్రంలో కొట్టుకు వ‌చ్చిన బంగారం రధంపై తేది 16-1-2022 అని విదేశీ బాషలో రాసి ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఇది మ‌లేషియా, థాయిలాండ్ లేదా జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఇదిలాఉంటే.. ఇటీవలి తుఫాను సమయంలో సైతం తూర్పు గోదావరి జిల్లాలో సముద్ర తీరంలో బంగారు నాణేలు లభించిన విషయం తెలిసిందే.

Also Read:

Cyclone Asani Live Updates: జెట్‌స్పీడ్‌తో దూసుకొస్తున్న అసని తుఫాన్.. కోస్తాంద్ర తీరంలో మొదలైన అలజడి..

Narayana Arrest: జోక్యం చేసుకుని న్యాయం చేయండి.. హోంమంత్రి అమిత్ షా, గవర్నర్‌కు చంద్రబాబు లేఖ..