AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narayana Arrest: జోక్యం చేసుకుని న్యాయం చేయండి.. హోంమంత్రి అమిత్ షా, గవర్నర్‌కు చంద్రబాబు లేఖ..

ఎంపీ రఘురామరాజు మాదిరిగా మాజీ మంత్రి నారాయణను హింసించే ప్రమాదం ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.

Narayana Arrest: జోక్యం చేసుకుని న్యాయం చేయండి.. హోంమంత్రి అమిత్ షా, గవర్నర్‌కు చంద్రబాబు లేఖ..
Chandrababu Naidu Amit Shah
Shaik Madar Saheb
|

Updated on: May 11, 2022 | 8:22 AM

Share

Chandrababu Naidu letter to Amit Shah: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. నారాయణ అరెస్ట్ రాజకీయ కక్షతో జరిగిందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి చిత్తూరు తరలింపులో జాప్యం వెనుక దురుద్దేశం ఉందన్నారు. ఈ మేరకు చంద్రబాబు మంగళవారం అర్ధరాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతోపాటు రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు లేఖ పంపారు. నారాయణకు (ap ex minister narayana) ముందస్తు నోటీసు ఇవ్వలేదని.. విచారణ కూడా చేయలేదని చంద్రబాబు పేర్కొన్నారు. ఎంపీ రఘురామరాజు మాదిరిగా మాజీ మంత్రి నారాయణను హింసించే ప్రమాదం ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ సమయంలో జరిగిన ఉదంతాన్ని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. పేపర్ లీకేజీ కేసులో అదనపు సెక్షన్లు జోడించి అక్రమ అరెస్ట్ కు పాల్పడ్డారన్నారు. చిత్తూరు ఎస్పీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే అధికారి అంటూ టీడీపీ అధినేత లేఖలో పేర్కొన్నారు. తక్షణం జోక్యం చేసుకుని ఆయన ప్రాథమిక హక్కులకు రక్షణగా నిలవాలి అని అభ్యర్థించారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన లేఖకు ఎఫ్‌ఐఆర్‌ కాపీని, చిత్తూరు పోలీసులు నారాయణ సతీమణికి ఇచ్చిన లేఖ ప్రతిని జతచేసి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, గవర్నర్‌ కు పంపారు. ఈ ఘటనపై జోక్యం చేసుకుని న్యాయం చెయాలని లేఖలో పేర్కొన్నారు.

కాగా.. నారాయణ అరెస్ట్‌ అనంతరం చంద్రబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అక్రమ కేసులతో నారాయణను అరెస్టు చేయడానికి సీఎం జగన్‌ సకల ప్రయత్నాలూ చేస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని.. దానిని కప్పిపుచ్చుకోడానికే నారాయణను అరెస్టు చేసిందంటూ విమర్శించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

Also Read:

Narayana Arrest : మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌కు పోలీస్‌ల పక్కా స్కెచ్.. అన్ని ఆధారాలు సేకరించాకే..!

AP News: చిత్తూరు జిల్లా ఆస్పత్రికి మాజీ మంత్రి నారాయణ.. వైద్య పరీక్షల నిర్వహణ.. మెజిస్ట్రేట్‌ ముందు హాజరు..