Narayana Arrest : మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌కు పోలీస్‌ల పక్కా స్కెచ్.. అన్ని ఆధారాలు సేకరించాకే..!

Narayana Arrest - Paper Leakage: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌కు పోలీస్‌ల స్కెచ్‌ వర్కౌట్‌ అయింది. SSC పరీక్షల మాల్‌ ప్రాక్టీస్‌, కాపీయింగ్‌పై పక్కా ఆధారాలు..

Narayana Arrest : మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌కు పోలీస్‌ల పక్కా స్కెచ్.. అన్ని ఆధారాలు సేకరించాకే..!
Narayana Arrest
Follow us

|

Updated on: May 11, 2022 | 6:09 AM

Narayana Arrest – Paper Leakage: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌కు పోలీస్‌ల స్కెచ్‌ వర్కౌట్‌ అయింది. SSC పరీక్షల మాల్‌ ప్రాక్టీస్‌, కాపీయింగ్‌పై పక్కా ఆధారాలు సేకరించిన చిత్తూరు జిల్లా పోలీసులు.. ఏ మాత్రం ఛాన్స్‌ ఇవ్వకుండా వల వేసి పట్టేశారు. లేకపోతే ఫారన్‌కు చెక్కేసే వారేనంటన్నారు పోలీసులు. ఇంతకు పోలీసులు దగ్గర ఉన్న ఆధారాలేంటి? ఎలాంటి అభియోగాలు మోపారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఫైనల్‌గా కార్పొరేట్‌ స్కూళ్లలో జోరుగా మాస్‌ కాపీయింగ్‌ జరుగుతోందని తేల్చారు అధికారులు. ఇదంతా నారాయణ స్కూల్స్‌ కేంద్రంగానే సాగిందని నిర్ధారించారు. చిత్తూరులోని నారాయణ స్కూల్‌ ప్రిన్సిపల్‌ గిరిధర్‌ ఇచ్చిన చిన్న క్లూతోనే ఈ బండారం మొత్తం బయట పెట్టారు. మాల్‌ ప్రాక్టీస్‌కు సంబంధించి గిరిధర్‌రెడ్డి ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌ ఆధారంగానే నారాయణను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు పోలీసులు. ఇంటరాగేషన్‌లో పేపర్ల లీకేజీ అసలు గుట్టును బయటపెట్టాడు గిరిధర్‌. ర్యాంకులు, ఎక్కువ అడ్మిషన్స్‌ కోసమే కొన్నేళ్లుగా మాల్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడించాడు. నారాయణ విద్యాసంస్థల్లోని స్టూడెంట్స్‌.. తెలుగు, హిందీ, సోషల్‌ స్టడీస్‌లో స్టూడెంట్స్‌ వీక్‌గా ఉంటారట. అందుకోసమే.. లాంగ్వేజ్‌ పేపర్ల లీకేజీకి పాల్పడినట్టు ఇంటరాగేషన్‌లో ఒప్పుకున్నారు గిరిధర్‌. ముందుగానే ఇన్విజిలేటర్స్‌తో డీల్ మాట్లాడుకుని, నారాయణ విద్యాసంస్థలు మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నాయన్నారు చిత్తూరు ఎస్పీ రిశాంత్‌రెడ్డి. ఇది, ఎప్పట్నుంచో జరుగుతోందన్నారు.

ఇవి కూడా చదవండి

ఇన్విజిలేటర్స్‌ ద్వారానే నారాయణ విద్యార్ధులకు సమాధానాలు చెరవేస్తారన్న గుట్టు మొత్తం విచారణలో బయట పడింది. వాటర్ బాయ్స్‌, అటెండర్స్‌ ద్వారా ఆన్సర్స్‌ పంపిస్తారట. ఈ మొత్తం వ్యవహారమంతా కూడా నారాయణ ఆదేశాల మేరకే చేస్తారని ఎస్పీ వెల్లడించారు. ముందుగానే సెంటర్స్‌, విద్యార్థుల వివరాలు కూడా సేకరిస్తారని ఎస్పీ రిశాంత్‌రెడ్డి తెలిపారు. ఈ కేసులో కీలక నిందితుడిగా నారాయణను చేర్చిన పోలీసులు.. 408, 409 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 409 సెక్షన్‌ కింద కనీసం 10ఏళ్ల జైలు శిక్ష పడుతుందని తెలిపారు ఎస్పీ రిశాంత్‌రెడ్డి.

'పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు'.. నాగబాబు
'పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు'.. నాగబాబు
కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..