AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: భగ్గుమన్న పాత కక్షలు.. పక్కా ప్లాన్ ప్రకారం.. పంచాయతీ కార్యదర్శిపై దాడి

పల్నాడు(Palnadu) జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. గతంలో జరిగిన గొడవలను మనసులో పెట్టుకుని పంచాయతీ కార్యదర్శిపై దాడి చేశారు. దాడిలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు...

Andhra Pradesh: భగ్గుమన్న పాత కక్షలు.. పక్కా ప్లాన్ ప్రకారం.. పంచాయతీ కార్యదర్శిపై దాడి
Attack
Ganesh Mudavath
|

Updated on: May 11, 2022 | 1:29 PM

Share

పల్నాడు(Palnadu) జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. గతంలో జరిగిన గొడవలను మనసులో పెట్టుకుని పంచాయతీ కార్యదర్శిపై దాడి చేశారు. దాడిలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. పంచాయతీ సెక్రటరీపై మాజీ వాలంటీర్ కత్తితో దాడి చేశాడు. నకరికల్లు మండలంలోని గుళ్లపల్లి గ్రామంలో పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న జాన్ పీరాపై మాజీ వాలంటీర్ అలీ తన బంధువులతో కలిసి దాడి చేశాడు. నారాయణపురంలో గతంలో జరిగిన అంజుమన్ కమిటీ ఎన్నికపై తలెత్తిన వివాదంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో వాలంటీర్ గా పని చేస్తున్న అలీని విధుల నుంచి తొలగించారు. ఈ క్రమంలో పాత కక్షలతో పక్కా ప్లాన్ ప్రకారం కర్రలు, కత్తులతో జాన్ పీరాపై 25 మంది దాడి చేశారు. జాన్ పీరా గతంలో దాచేపల్లి పంచాయతీ సెక్రటరీగా పని చేశారు. ప్రస్తుతం నకరికల్లు మండలం గుళ్లపల్లి పంచాయితీ సెక్రటరీ గా విధులు నిర్వహిస్తున్నారు.

దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన జాన్ పీరాను చికిత్స కోసం దాచేపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేయించిన తరువాత మెరుగైన వైద్యం కోసం పిడుగురాళ్ల తీసుకెళ్లారు. దాడి ఘటనపై బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Vodafone Idea: మళ్లీ పుంజుకుంటున్న వోడాఫోన్ ఐడియా.. నష్టాలను తగ్గించుకుని..

Hyderabad: ప్రాణం తీసిన డాక్టర్ల నిర్లక్ష్యం.. చిన్నారులను ఇంక్యుబేటర్​లో పెట్టి మరిచిపోయారు.. కట్ చేస్తే..