Train Ticket Rules: రైల్వే ప్రయాణీకులకు ముఖ్య అలెర్ట్.. ఇకపై టికెట్ బుక్ చేయాలంటే అవి తప్పనిసరి..
మీరు ట్రైన్‌లో దూర ప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా.? ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోబోతున్నారా.? అయితే ఒక్క క్షణం ఆగండి..
మీరు ట్రైన్‌లో దూర ప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా.? ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోబోతున్నారా.? అయితే ఒక్క క్షణం ఆగండి.. మీకో ముఖ్య అలెర్ట్.. ఆన్‌లైన్ ట్రైన్ టికెట్ బుకింగ్ రూల్స్‌లో ఐఆర్‌సీటీసీ పలు మార్పులు తీసుకొచ్చింది. ఇకపై టికెట్ బుక్ చేసే ముందు మీరు తప్పనిసరి మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీలను ధృవీకరించడం తప్పనిసరి. వీటి వెరిఫికేషన్ లేకుండా ఆన్‌లైన్ ద్వారా ట్రైన్ టికెట్ బుకింగ్ సాధ్యం కాదు.
మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీని ధృవీకరించడం ఎలా..?
-
ముందుగా IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌కి లాగిన్ అవ్వాలి. అనంతరం స్క్రీన్‌పై ఉండే వెరిఫికేషన్ విండోపై క్లిక్ చేయండి.
-
వెరిఫికేషన్ విండో ఓపెన్ అయిన తర్వాత.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీలను నమోదు చేయండి.
-
వెరిఫికేషన్ ఆప్షన్ స్క్రీన్‌కు కుడి వైపున, ఎడిట్ ఆప్షన్ ఎడమ వైపున ఉంటాయి.
-
మీ వివరాలలో ఏదైనా మార్చాలనుకుంటే, వాటిని సవరించడానికి ఎడిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.. లేదా వెరిఫికేషన్ ఆప్షన్‌పై నొక్కండి.
-
వెరిఫికేషన్‌పై క్లిక్ చేసిన అనంతరం, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు OTP వస్తుంది. దానిని అక్కడ ఇచ్చిన బాక్స్‌లో నమోదు చేయండి.
-
పై విధంగానే ఈ-మెయిల్ ఐడీని కూడా ధృవీకరించండి. మీ మెయిల్‌కు సంబంధిత ఓటీపీ వస్తుంది.
మరికొన్ని ప్రత్యేక రైళ్లు..
ప్రయాణీకులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు భారతీయ రైల్వే మరికొన్ని స్పెషల్ సర్వీసులను పట్టాలెక్కించింది. వేసవి సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రద్దీ ఉండే ప్రదేశాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అలాగే పలు రైళ్లలో కోచ్‌ల సంఖ్యను పెంచుతోంది.