AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2024 Elections: గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశాలు.. 15000 మంది ప్రతినిధుల హాజరు..

బీజేపీని గద్దె దింపడమే లక్ష్యమని కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశాల్లో ఆ పార్టీ నేతలు ప్రకటించారు. కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీకి ఎన్నికలు కాకుండా అధ్యక్షుడే సభ్యులను నియమించేలా నిర్ణయం తీసుకున్నారు.

2024 Elections: గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశాలు.. 15000 మంది ప్రతినిధుల హాజరు..
Congress Plenary Meetings
Venkata Chari
|

Updated on: Feb 24, 2023 | 9:06 PM

Share

2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా రాయ్‌పూర్‌లో కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. రాహుల్‌ , సోనియాతో పాటు దేశం నలుమూలల నుంచి 15000 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర తరువాత జరుగుతున్న ప్లీనరీలో కీలక సమావేశాలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీకి ఎన్నికలు నిర్వహించరాదని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. CWC సభ్యులను కాంగ్రెస్‌ అధ్యక్షుడే ఎంపిక చేస్తారని ప్రకటించారు. కాంగ్రెస్‌ స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇతర పార్టీలతో పొత్తులపై చర్చ..

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తులపై కూడా సమావేశాల్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది. వీరప్ప మొయిలీ లాంటి నేతలు కొన్ని ప్రాంతీయ పార్టీలతో పొత్తులను సమర్ధించారు. అయితే చాలామంది నేతలు బీఆర్‌ఎస్‌ , తృణమూల్‌ లాంటి పార్టీలతో పొత్తులను వ్యతిరేకిస్తున్నారు.

తెలంగాణతో పాటు కేంద్రంలో తప్పకుండా కాంగ్రెస్‌ అధికారం లోకి వస్తుందని అన్నారు పార్టీ సీనియర్‌ నేత వీ.హనుమంతరావు. వీహెచ్‌తో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు తెలుగు రాష్ట్రాల నుంచి ప్లీనరీ సమవేశాలకు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

మాజీ ప్రధానులు, మాజీ రాష్ట్రపతులకు.. వర్కింగ్‌ కమిటీలో చోటు ఉండేలా నిబంధన..

పార్టీకి చెందిన మాజీ ప్రధానులు, మాజీ రాష్ట్రపతులకు వర్కింగ్‌ కమిటీలో చోటు ఉండేలా పార్టీ నిబంధనల్లో సవరణ చేసేందుకు కమిటీ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు అవసరం లేదని సీనియర్లు.. ఉండాలని జూనియర్లు డిమాండ్‌ చేస్తున్న తరుణంలో సీడబ్ల్యూసీ ఎన్నికల అంశం పార్టీలో ప్రాధాన్యం సంతరించుకుంది. చివరిసారిగా 1997లో సీడబ్ల్యూసీకి ఎన్నికలు జరిగాయి.

ఈ ఏడాది చివర్లో ఎన్నికలకు వెళ్తున్న ఛత్తీస్‌గఢ్‌లో ప్లీనరీ నిర్వహించడం ద్వారా.. ఆ రాష్ట్రంతోపాటు, పక్కనే ఉన్న మధ్యప్రదేశ్‌, తెలంగాణల్లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపవచ్చని కాంగ్రెస్‌ హైకమాండ్‌ భావిస్తోంది. ఈ ఏడాది ఎన్నికలు జరిగే కర్ణాటక, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..