Jagga Reddy: బహిరంగ విమర్శలు ఉండవు.. మీరు కూడా చూడరు.. కీలక విషయాలను వెల్లడించిన జగ్గారెడ్డి..

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ సందేశం విన్న తర్వాత గతంలో తాను చెప్పిన విషయాలన్నీ మర్చిపోయానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో కుటుంబ సభ్యులతో కలిసి జగ్గారెడ్డి రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు.

Jagga Reddy: బహిరంగ విమర్శలు ఉండవు.. మీరు కూడా చూడరు.. కీలక విషయాలను వెల్లడించిన జగ్గారెడ్డి..
Jagga Reddy
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 06, 2022 | 7:18 PM

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సందేశం విన్న తర్వాత గతంలో తాను చెప్పిన విషయాలన్నీ మర్చిపోయానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy) అన్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో కుటుంబ సభ్యులతో కలిసి జగ్గారెడ్డి రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇకపై బహిరంగ విమర్శలు ఉండవు.. మీరు కూడా చూడరు అని వెల్లడించారు. పార్టీలో ఇప్పుడు సమస్యలే లేవని వెల్లడించారు జగ్గారెడ్డి.. నా కుటుంబ సభ్యులతో కలిసి రాహుల్ గాంధీని కలవాలని ఎప్పటినుంచో అనుకున్నాను. అది ఈరోజు కుదిరిందన్నారు. రాజకీయాల కంటే ముందు మా పిల్లల చదువుల గురించి రాహుల్ గాంధీ అడిగారని అన్నారు. తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదన్నారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలను  ఏవిధంగా నిలదీయాలి.. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎలా పోరాడాలనే దానిపై రాహుల్‌ చర్చించారని తెలిపారు.

ఈ 3 పార్టీలను ఎదుర్కోవాలని రాహుల్‌ తమకు దిశానిర్దేశం చేశారు. రాహుల్‌తో మాట్లాడిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్న విభేదాలన్నీ మర్చిపోయానని అన్నారు. అప్పుడు చెప్పిన విషయాలేవీ గుర్తులేవని.. కాంగ్రెస్‌ను గెలిపించేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో మా మధ్య ఎలాంటి విభేదాలు ఉండవు.. కలిసికట్టుగా ఎలా పనిచేస్తామో మీరే చూస్తారని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి రాహుల్‌గాంధీతో ఫొటో దిగడం ఆనందంగా ఉందని, అందుకే ఢిల్లీ వచ్చామని వివరించారు.

ఇవి కూడా చదవండి: MIM Corporator: ఎంఐఎం కార్పొరేటర్‌ గౌస్‌ అరెస్ట్‌.. మంత్రి కేటీఆర్‌ సూచనతో స్పందించిన పోలీసులు

Telangana University: తెలంగాణ యూనివర్సిటీ క్యాంటిన్ టిఫిన్‌లో కప్ప.. విద్యార్థుల ఆందోళన..

Optical Illusion: ఈ ఫోటోలో ఏముందో గుర్తించండి.. మొదటగా కనిపించేదే మీ బలం..