AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: ఆ విషయంలో పంతం నెగ్గించుకున్న రాహుల్ గాంధీ.. కోరుకున్నట్లే జరిగిందిగా..

నాలుగు నెలల క్రితం తుగ్లక్ లేన్ లోని ఆ ఇంటిని ఖాళీ చేసిన రాహుల్‌.. మళ్లీ దానినే కేటాయించడంపై స్పందించారు. ఎంపీగా తన అధికారిక నివాసాన్ని తిరిగి పొందడంపై ప్రతిస్పందనను అడిగినప్పుడు.. రాహుల్ వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ.. "మేరా ఘర్ పూరా హిందుస్థాన్ హై (భారతదేశం మొత్తం నా ఇల్లే)" అంటూ వ్యాఖ్యానించారు.

Rahul Gandhi: ఆ విషయంలో పంతం నెగ్గించుకున్న రాహుల్ గాంధీ.. కోరుకున్నట్లే జరిగిందిగా..
Rahul Gandhi
Shaik Madar Saheb
|

Updated on: Aug 08, 2023 | 9:21 PM

Share

ఢిల్లీ, ఆగస్టు 08: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీకి వరుసగా గుడ్‌న్యూస్‌లు వస్తున్నాయి. లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడంతో రాహుల్‌కు పాత నివాసాన్ని మళ్లీ కేటాయించారు. 12 తుగ్లక్‌ లేన్‌ లోని రాహుల్‌గాంధీ నివాసాన్ని లోక్‌సభ సెక్రటేరియట్‌ తిరిగి ఆయనకే కేటాయించింది. ‘మోదీ’ ఇంటిపేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యల అనంతరం కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత రాహుల్ హైకోర్టుకు వెళ్లిన ప్రయోజనం లేకపోయింది. దీంతో లోక్‌సభ హౌస్ కమిటీ మార్చి 24న దిగువ సభ సభ్యునిగా అనర్హత వేటు వేసింది. అనర్హత వేటు, రెండేళ్ల జైలు శిక్ష విధించిన తర్వాత ఆయన బంగ్లాను ఖాళీ చేయాలని లోక్‌సభ సెక్రటేరియట్‌ నోటీసులిచ్చింది. దీంతో రాహుల్ ఈ ఏడాది ఏప్రిల్‌లో బంగ్లాను ఖాళీ చేశారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సుప్రీం కోర్టుకు వెళ్లడంతో.. ఊరట లభించింది. మోదీ ఇంటి పేరు విషయంలో సూరత్‌ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాహుల్‌ గాంధీకి రెండేళ్ల గరిష్ట శిక్ష ఎందుకు విధిస్తున్నారో సూరత్‌ కోర్టు నిర్ధిష్టంగా పేర్కొనలేదు కావున.. ఆ శిక్షపై స్టే విధించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. దీంతో పార్లమెంటరీ సభ్యత్వం పునరుద్ధరణ తర్వాత ఢిల్లీలోని 12 తుగ్లక్ లేన్ బంగ్లాను తిరిగి కేటాయించినట్లు కాంగ్రెస్ వర్గాలు మంగళవారం తెలిపాయి.

Rahul Gandhi

Rahul Gandhi

నాలుగు నెలల క్రితం తుగ్లక్ లేన్ లోని ఆ ఇంటిని ఖాళీ చేసిన రాహుల్‌.. మళ్లీ దానినే కేటాయించడంపై స్పందించారు. ఎంపీగా తన అధికారిక నివాసాన్ని తిరిగి పొందడంపై ప్రతిస్పందనను అడిగినప్పుడు.. రాహుల్ వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ.. “మేరా ఘర్ పూరా హిందుస్థాన్ హై (భారతదేశం మొత్తం నా ఇల్లే)” అంటూ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

గత ఏప్రిల్‌లో తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసిన రాహుల్‌.. 10 జన్‌పథ్‌లోని తన తల్లి, సోనియా గాంధీ నివాసంలో ఆమెతోపాటే ఉంటున్నారు. . 2005 నుంచి ఏప్రిల్‌లో ఖాళీ చేసేంతవరకు రాహుల్‌ అదే బంగ్లాలో నివాసమున్నారు. అయితే, హౌసింగ్‌ కమిటీ తిరిగి బంగ్లా కేటాయించినప్పటికీ.. ఆయన అందులోకి మారతారా? లేదంటే తల్లితోపాటు 10 జన్‌పథ్‌లోనే ఉంటారా? అనేదానిపై స్పష్టత లేదు.

దేశమంతా కాంగ్రెస్‌కు పునర్‌వైభవం తీసుకురావడానికి రాహుల్‌ ప్రయత్నిస్తున్నారు. ప్రతిరోజు వివిధ రాష్ట్రాల నేతలతో సమావేశమవుతున్నారు. అసోం నేతలతో ఏఐసీసీ భవనంలో సమావేశమయ్యారు రాహుల్‌. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..