Rahul Gandhi Yatra: రాహుల్ యాత్ర 2.0కు శ్రీకారం.. 15 రాష్ట్రాలు, 6700 కి.మీ.. ముగింపు ఎక్కడంటే..?
లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ మళ్లీ భారత్ యాత్ర చేయాలని భావిస్తున్నారు. జనవరి 14 నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర పేరు ‘భారత్ జోడో న్యాయ యాత్ర’గా నామకరణం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ వెల్లడించారు. గతంలో ఈ యాత్రకు 'భారత్ న్యాయ యాత్ర' అని పేరు పెట్టారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ మళ్లీ భారత్ యాత్ర చేయాలని భావిస్తున్నారు. జనవరి 14 నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర పేరు ‘భారత్ జోడో న్యాయ యాత్ర’గా నామకరణం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ వెల్లడించారు. గతంలో ఈ యాత్రకు ‘భారత్ న్యాయ యాత్ర’ అని పేరు పెట్టారు.
మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. జనవరి 14న మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలయ్యే ఈ యాత్రను.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జెండా ఊపి యాత్రను ప్రారంభిస్తారని జైరాం రమేష్ తెలిపారు. ఈ పర్యటనలో రాహుల్ గాంధీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంపై తన అభిప్రాయాలను ప్రజలకు అందజేస్తారని చెప్పారు. 110 జిల్లాల మీదుగా.. 6,700 కిలోమీటర్ల మేర సాగనుంది ఈ యాత్ర. 15 రాష్ట్రాల గుండా ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బస్సు, కాలినడకన ప్రయాణించనున్నారు. ఈ యాత్రలో ఇండియా కూటమి నేతలను కూడా ఆహ్వానించనున్నట్లు జైరాం రమేష్ తెలిపారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర కింద 67 రోజుల్లో 6713 కి.మీ ప్రయాణం చేస్తారు. ఈ యాత్ర 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల గుండా సాగుతుంది. 100 లోక్‌సభ స్థానాలను చుట్టేస్తూ.. రాహుల్ గాంధీ యాత్ర ముంబైలో ముగియనుంది. ఈ మేరకు గురువారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 2024 ఎన్నికల సన్నాహాలు, మణిపూర్-ముంబై మధ్య రాహుల్ గాంధీ ప్రయాణం గురించి చర్చించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులందరూ హాజరయ్యారు.
ఇదిలావుంటే అంతకు ముందుకు రాహుల్ గాంధీ 4000 కి.మీల సుదీర్ఘ భారత్ జోడో యాత్ర నిర్వహించారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ నాయకత్వంలో చేపట్టారు. యావత్ దేశ వాతావరణాన్ని మార్చి కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపారు. ఆ యాత్ర పార్టీ చరిత్రలో, దేశ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిందన్నారు జైరాం రమేష్.
రాహుల్ గాంధీ ప్రయాణ మార్గం.. భారత్ జోడో న్యాయ యాత్ర రూట్ మ్యాప్
• మణిపూర్‌లో 107 కి.మీ ప్రయాణంలో 4 జిల్లాలు కవర్ చేస్తారు.
• నాగాలాండ్‌లో ఈ యాత్ర 5 జిల్లాల గుండా 257 కి.మీ మేర సాగుతుంది.
• అస్సాం 833 కి.మీ ప్రయాణంలో యాత్ర 17 జిల్లాల్లో సాగుతుంది.
• అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 55 కి.మీ ప్రయాణంలో ఒక జిల్లాను కవర్ చేస్తారు.
• మేఘాలయలో రాహుల్ గాంధీ 5 కి.మీ ప్రయాణించి ఒక జిల్లా గుండా వెళతారు.
• పశ్చిమ బెంగాల్‌లో 523 కి.మీ ప్రయాణం చేయాలి. ఈ యాత్ర 7 జిల్లాలకు చేరుకుంటుంది.
• రాహుల్ గాంధీ బీహార్‌లో 425 కిలోమీటర్ల సుదీర్ఘ యాత్రను చేపట్టి 7 జిల్లాలను కవర్ చేయనున్నారు.
• జార్ఖండ్ రాష్ట్రంలో ఈ యాత్ర 804 కి.మీ ప్రయాణంలో 13 జిల్లాలకు చేరుకుంటుంది.
• ఒరిస్సాలో 341 కి.మీ పొడవు ఈ యాత్ర ఉంటుంది. ఒరిస్సాలో 4 జిల్లాల గుండా వెళుతుంది.
• ఛత్తీస్‌గఢ్ 7 జిల్లాల గుండా 536 కి.మీ. ప్రయాణం సాగుతుంది.
• ఉత్తరప్రదేశ్‌లో రాహుల్ గాంధీ 1,074 కిలోమీటర్లు ప్రయాణించి 20 జిల్లాల గుండా వెళతారు.
• మధ్యప్రదేశ్‌లో 698 కి.మీ ప్రయాణం ఉంటుంది. 9 జిల్లాలకు చేరుకుంటుంది.
• రాజస్థాన్‌లో ఈ యాత్ర 128 కి.మీ దూరం ప్రయాణించి 2 జిల్లాల గుండా వెళుతుంది.
• గుజరాత్‌లో 445 కి.మీ మార్గం కవర్ చేస్తుంది. ఇది 7 జిల్లాల గుండా వెళుతుంది.
• మహారాష్ట్రలో ప్రయాణం 480 కి.మీ. ఇది 6 జిల్లాల గుండా వెళుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…