AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: దేవుడ..! థమ్స్ అప్ ఇలా కూడా తాగొచ్చా.. వైరల్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

ఢిల్లీ మెట్రో రైలులో అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. మొన్నటి వరకూ డ్యాన్సులు వేయడం, కొట్టుకోవడం లాంటివి చూశాం. అయితే తాజాగా మరో అసభ్యకరమైన వీడియోను ఒక జంట తమ సామాజి మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ మధ్య కాలంలో ఫేమస్ అవడం కోసం ఓవర్ నైట్ పాపులారిటీ కోసం ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా కొంత మంది యువత ఇలాంటి వాటిని ప్రేరేపిస్తున్నారు.

Viral Video: దేవుడ..! థమ్స్ అప్ ఇలా కూడా తాగొచ్చా.. వైరల్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Delhi Metro Viral Video
Srikar T
|

Updated on: Jan 04, 2024 | 6:48 PM

Share

ఢిల్లీ మెట్రో రైలులో అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. మొన్నటి వరకూ డ్యాన్సులు వేయడం, కొట్టుకోవడం లాంటివి చూశాం. అయితే తాజాగా మరో అసభ్యకరమైన వీడియోను ఒక జంట తమ సామాజి మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ మధ్య కాలంలో ఫేమస్ అవడం కోసం ఓవర్ నైట్ పాపులారిటీ కోసం ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా కొంత మంది యువత ఇలాంటి వాటిని ప్రేరేపిస్తున్నారు. షూ లో కొంత థమ్స్ అప్ వేసుకొని చిన్న స్ట్రా ద్వారా సేవించారు. ముందు బాయ్ ప్రెండ్ తాగిన తరువాత తన గర్ల్ ఫ్రెండ్ కూడా సిప్ చేశారు.

బాయ్‌ఫ్రెండ్ తన కాలుకు ధరించిన రెండు షూస్‌లో ఒకదాన్ని చేతిలో పట్టుకున్నాడు. అతని గర్ల్ ఫ్రెండ్ ఆ షూలో డ్రింక్ పోయడం ప్రారంభించింది. దీనిని బాగా క్లియర్ గా చూపింస్తూ వీడియో తీశారు. అవును, మీరు చదివింది నిజమే. వారు కాలికి ధరించే షూ లోపల కప్పును ఉంచారా లేదా అనేది చూపించలేదు. కానీ విజువల్స్ విషయానికొస్తే, వారు షూ నుండి థమ్స్ అప్ తాగినట్లు కనిపించింది. గతంలో ఇదే కోక్ టిన్‎ను అమ్మాయి, అబ్బాయి పరస్పరం ఒకరి నోటిలో ఒకరు ఉమ్ముకుంటూ సేవించిన ఘటనలు ఉన్నాయి. అయితే ఇలా షూలో తాగడం అనేది వారి పరాకాష్టకు నిదర్శనంగా చెబుతున్నారు కొందరు నెటిజన్స్.

నైక్ వోమెరో స్పోర్ట్స్ షూలో థమ్స్ అప్ ను తాగినట్లు వీడియోలో కనిపించింది. ఈ జంట తమ వీడియో చిత్రీకరణ కోసం మహిళల కోసం కేటాయించిన సీట్లపై కూర్చున్నట్లు కూడా క్లియర్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోపై కొంత మంది అసహ్యాన్ని వ్యక్తం చేస్తుంటే.. మరి కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..