Bharat Jodo Yatra: 600 కిలోమీటర్ల యాత్ర పూర్తి .. కర్ణాటక ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ..

Congress Bharat Jodo Yatra: భారత్‌ జోడో యాత్ర కర్నాటకలో ఉత్సహంగా ముందుకు కదులుతోంది. మైసూర్‌లో పాదయాత్ర సందర్భంగా మందిర్‌, మసీదు, చర్చిని రాహుల్‌ సందర్శించారు. ప్రతి పనికి 40 శాతం కమీషన్‌ తీసుకుంటున్న ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం ఉందని విమర్శించారు.

Bharat Jodo Yatra: 600 కిలోమీటర్ల యాత్ర పూర్తి .. కర్ణాటక ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ..
Congress Bharat Jodo Yatra
Follow us

|

Updated on: Oct 04, 2022 | 6:21 AM

కర్నాటకలో రాహుల్‌గాంధీ పాదయాత్ర జోరుగా సాగుతోంది. మాండ్య జిల్లా మీదుగా మైసూర్‌ జిల్లాల్లో రాహుల్‌గాంధీ పాదయాత్ర ప్రవేశించింది. దసరా ఉత్సవాల సందర్భంగా చాముండేశ్వరి దేవిని రాహుల్‌గాంధీ సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భారత్‌ జోడో యాత్ర సందర్భంగా రాహుల్‌గాంధీ ఒకే రోజు ఆలయం, మసీదు, చర్చిల్లో ప్రార్ధనలు చేశారు.

రాహుల్‌తో కలిసి భారత్‌ జోడో యాత్రలో సోనియా..

ఇవి కూడా చదవండి

మైసూర్‌లో ఆలయంతో మసీదు, చర్చి దగ్గర రాహుల్‌కు ఘనస్వాగతం లభించింది. తనకు అన్ని మతాలు సమానమే అని ఆయన అన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ మైసూర్‌కు వచ్చారు. ఈనెల 6, 7 తేదీల్లో తనయుడు రాహుల్‌తో కలిసి భారత్‌ జోడో యాత్రలో సోనియా పాల్గొంటారు. దసరా సందర్భంగా రెండు రోజుల పాటు కూర్గ్‌లోనే సోనియాగాంధీ బస చేస్తారు.

ఈ క్రమంలో రాహుల్‌గాంధీ కర్నాటక ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రతి పనుల్లో 40 శాతం కమీషన్‌తో ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కర్నాటకలో ఎక్కువ అవినీతి ఉందన్నారు. అవినీతిలో కర్నాటక టాప్‌లో ఉంది. ప్రతి పనిలో ఇక్కడ 40 శాతం కమీషన్‌ తీసుకుంటున్నారు. రైతులు , చిరువ్యాపారులు , కార్మికుల నుంచి లంచాలు తీసుకుంటున్నారు అంటూ విమర్శలు గుప్పించారు.

రాహుల్‌ పాదయాత్రలో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వృద్దులను , చిన్నారులు అప్యాయంగా పలుకరిస్తూ , అక్కున చేర్చుకుంటూ రాహుల్‌ గాంధీ ముందుకు కదులుతున్నారు.

రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..