Political Clashes: సాక్షాత్తు సీఎం పాల్గొన్న సభ అది.. క్షణాల్లో ఆగమాగం.. కొట్టుకునేంత పని చేశారు..!
Political Clashes: బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన టాప్ లీడర్లే కొట్టుకోబోయారు. ఈ ఘటన ఇక్కడ కాదు.. కర్నాటకలో జరిగింది. సీఎం సమక్షంలోనే ఈ రచ్చంతా అయింది.
Political Clashes: బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన టాప్ లీడర్లే కొట్టుకోబోయారు. ఈ ఘటన ఇక్కడ కాదు.. కర్నాటకలో జరిగింది. సీఎం సమక్షంలోనే ఈ రచ్చంతా అయింది. వివరాల్లోకెళితే.. కర్ణాటకలోని రామనగరలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బెంగళూరు నగర నిర్మాత నడప్రభ కెంపెగౌడ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహా బీజేపీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నేతల మధ్య రచ్చ జరిగింది. అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వేదికపైనే వాగ్వాదానికి దిగారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి అశ్త్ నారాయణ్ మాట్లాడుతుండగా.. జనంలో నుంచి కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుతగిలారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అశ్వత్ నారాయణ్.. డీకే సురేష్‌పైనా, కాంగ్రెస్ పార్టీపైనా విమర్శలు చేశారు. సురేష్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం రాజుకుంది. ఇద్దరు ప్రజా ప్రతినిధుల మధ్య మాటామాట పెరిగింది. ఇరు వర్గాలవారు కూడా వారికి తోడవడంతో గందరగోళం నెలకొంది. అక్కడే ఉన్న పోలీసులు సర్దిచెప్పాలని ప్రయత్నించగా.. స్టేజ్‌పైనే ఎంపీ డీకే సురేష్ ధర్నాకు దిగారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ రవి మరో అడుగు ముందుకేసి అశ్వత్ నారాయణ్ మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులు, సెక్కురిటీ సిబ్బంది గుమిగూడిన ఇరు వర్గాలవారిని వారి వారి స్థానాల్లోకి పంపించివేయడంతో గొడవ సద్దుమణిగింది.
Also Read:
RBI Recruitment 2022: ఆర్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చంటే?
Realme GT 2 Pro: రియల్‌మీ తొలి ఫ్లాగ్‌షిప్ ఫోన్ విడుదలకు సిద్ధం.. ఫీచర్లివే!
Cyber Attack: రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. 40 పైసలకు 6 లక్షలు అంటూ భారీ ఝలక్..